కరివేపాకుతో ఇన్ని లాభాలు ఉన్నాయా?

కరివేపాకు మైగ్రేన్ తలనొప్పిని తగ్గించడంలో చక్కగా పనిచేస్తుంది.

కరివేపాకు రక్తంలోని చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది.

హార్మోన్లను నియంత్రించడంలో, బరువు తగ్గించడంలో అద్భుతంగా పనిచేస్తుంది.

కరివేపాకు ఆరోగ్యానికే కాదు.. జుట్టు సంరక్షణకు కూడా చాలా మంచిది.

కరివేపాకును కూరలు, సూప్ లలో కలిపి తీసుకుంటే శరీరానికి  ఎ,సి,బి,ఇ విటమిన్లు అందుతాయి.

కరివేపాకు, జీలకర్ర పొడిని పాలల్లో కలిపి తీసుకుంటే అజీర్తి సమస్యలు దూరం అవుతాయి.

కరివేపాకు రసం, నిమ్మరసం కలిపి తీసుకుంటే గ్యాస్ సమస్యలు నివారింపబడతాయి.

కరివేపాకు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

కరివేపాకును ఖాళీ కడుపుతో నమలడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను సమతుల్యం చేస్తుంది.

శరీరానికి కావాల్సిన రోగనిరోధక శక్తిని అందిస్తుంది.