ఈ పండు తింటే.. ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు
డామ్సన్‌లను జామ్‌లు, జెల్లీలు, పైస్, టార్ట్‌లు, స్లంప్స్ వంటి డెజర్ట్‌లలో ఉపయోగిస్తారు. అలాగే సాస్‌లో వాడతారు.
వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
డామ్సన్‌లు విటమిన్ ఎ, సి, కె, బి1, బి2, బి3, బి6 వంటి అనేక విటమిన్లు ఉంటాయి.
యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండటం వల్ల, ఇవి రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి.
ఈ పండ్లలో ఉండే యాంటీఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడంలో సహాయపడతాయి.
ఈ పండ్లలో పాలీఫెనాల్ కంటెంట్ ఉంటుంది. ఇది కణాలను, ఫ్రీ రాడికల్స్ దెబ్బతినకుండా కాపాడుతుంది.
ఇవి శరీరంలో మంటను నివారిస్తాయి. రుమటాయిడ్ ఆర్థరైటిస్ వంటి అనారోగ్యాల నుండి రక్షిస్తాయి.
ఇవి బాక్టీరియల్ సూక్ష్మజీవుల వల్ల కలిగే ఆహార సంబంధిత వ్యాధులను నివారించడంలో సహాయపడతాయి.
డామ్సన్ ప్లమ్ పండులోని కొన్ని సమ్మేళనాలు క్యాన్సర్ కణాలను నిరోధిస్తాయి.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో అద్భుతంగా పనిచేస్తాయి.