చియా సీడ్స్తో శరీరానికి ఎన్నో ప్రయోజనాలు !
చియా విత్తనాలలో ఫైబర్, ప్రోటీన్, ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు, కాల్షియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి.
ఒమేగా-3 కొవ్వు ఆమ్లాలు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడతాయి.
రక్తపోటును నియంత్రించడంలో తోడ్పడతాయి.
వీటిలో ఉండే ఫైబర్ కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. ఇది బరువు తగ్గించడంలో సహాయపడుతుంది.
అధిక ఫైబర్ కంటెంట్ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.
ప్రోటీన్, జింక్, యాంటీఆక్సిడెంట్లు జుట్టును బలోపేతం చేయడంలో సహాయపడతాయి.
వీటిని నీటిలో నానబెట్టి తాగవచ్చు, లేదా స్మూతీలు, జ్యూస్లలో కలపవచ్చు.
వీటిలో కాల్షియం అధికంగా ఉండటం వల్ల ఎముకలను బలంగా ఉంచుతాయి.
బ్లడ్ షుగర్ని కంట్రోల్లో ఉంచుతుంది.
గుండె ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది.