పుట్టగొడుగులు తింటే కలిగే లాభాలివే..
శరీరానికి కావలసిన ప్రోటీన్‌ను అందించి కండరాలను బలపరుస్తుంది.
బరువు తగ్గాలనుకునేవారికి పర్ఫెక్ట్ ఫుడ్.
పుట్టగొడుగులలో ఉండే బీటా గ్లూకాన్స్ రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తాయి.
శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను తొలగించి కణాలను రక్షిస్తుంది.
ఫైబర్ సమృద్ధిగా ఉండడం వల్ల అజీర్ణం, గ్యాస్ వంటి సమస్యలు తగ్గుతాయి.
టాక్సిన్లను బయటకు పంపి కాలేయాన్ని శుభ్రపరుస్తుంది.
ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు చర్మం కాంతివంతంగా, ముడతలులేకుండా ఉంచుతాయి.
కొన్ని రకాల పుట్టగొడుగులు క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.
బ్రెయిన్ హెల్త్‌కు చాలా మంచిది.
మినరల్స్, విటమిన్ D సమృద్ధిగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా మారతాయి.
ఐరన్ సమృద్ధిగా ఉండటం వల్ల రక్తంలో హీమోగ్లోబిన్ పెంపులో సహాయపడుతుంది.