మునక్కాయ తింటే ఇన్ని ప్రయోజనాలా..?
మునగకాయలో ఉండే ప్రోటీన్ శరీర కండరాల అభివృద్ధికి సహాయం చేస్తుంది.
విటమిన్ C సమృద్ధిగా ఉండడం వల్ల జలుబు, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ కల్పిస్తుంది.
కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంతో ఎముకలను బలంగా ఉంచుతుంది.
కాల్షియం, ఫాస్ఫరస్ ఎక్కువగా ఉండటంతో ఎముకలను బలంగా ఉంచుతుంది.
ఫైబర్ ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
మునగ ఆకులు, కాయలు పొటాషియం సమృద్ధిగా ఉండటంతో రక్తపోటును సమతుల్యం చేస్తాయి.
మునగలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ గుణాలు లివర్ టాక్సిన్లను తొలగించడంలో సహాయపడతాయి.
ఐరన్, విటమిన్ B సమృద్ధిగా ఉండటం వల్ల జుట్టు మూలాలను బలపరుస్తుంది.
ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఉండటం వల్ల గర్భిణీలకు మునగ కాయలు చాలా మంచివి.
మునగలో ఐరన్ అధికంగా ఉండటం వల్ల హీమోగ్లోబిన్ స్థాయిని పెంచుతుంది.
కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.