బ్రకోలీ తింటే ఈ సమస్యలన్నీ దూరం

బ్రోకలిలో విటమిన్‌ C, K, A,ఫోలేట్‌ సమృద్ధిగా ఉంటాయి. ఇవి శరీరానికి అవసరమైన పోషకాలను సమతుల్యంగా అందిస్తాయి.

విటమిన్ C అధికంగా ఉండటం వల్ల ఇమ్యూన్ సిస్టమ్‌ బలపడుతుంది.

బ్రోకలి లోని ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి, హృదయ సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తాయి.

బ్రోకలి లో ఉన్న సల్ఫోరాఫేన్‌  అనే సమ్మేళనం క్యాన్సర్ కణాల పెరుగుదలను అడ్డుకోవడంలో సహాయపడుతుంది.

బ్రోకలి లో ల్యూటిన్‌, జియాక్సాంతిన్‌ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

బ్రోకలి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో సహాయపడుతుంది.

ఫైబర్‌ అధికంగా ఉండటం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది. మలబద్ధకం వంటి సమస్యలు దూరమవుతాయి.

బ్రోకలి లో కాల్షియం, విటమిన్ K సమృద్ధిగా ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

బ్రోకలి లోని యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ C చర్మాన్ని నల్లబారకుండా, ముడతలు లేకుండా కాంతివంతంగా ఉంచుతాయి.

బ్రోకలి లోని విటమిన్ K మరియు కొలిన్‌ మెదడు కణాల పనితీరును మెరుగుపరుస్తాయి.

బ్రోకలి మహిళలలో హార్మోన్‌ బ్యాలెన్స్‌ కాపాడటంలో సహాయపడుతుంది.

బ్రోకలి లోని యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్య లక్షణాలను ఆలస్యం చేస్తాయి.