కొత్తిమీరతో లాభాలో తెలిస్తే అస్సలు వదలరు
కొత్తిమీరలో ఉండే యాంటీఆక్సిడెంట్లు.. రక్తంలోని విషపదార్థాలను తొలగించి రక్తాన్ని శుద్ధి చేస్తాయి.
అజీర్ణం సమస్యలను తగ్గిస్తాయి.
ఇందులోని పొటాషియం, మాగ్నీషియం, ఫైబర్ రక్తపోటును నియంత్రించి గుండె సంబంధిత వ్యాధులను నివారిస్తాయి.
వేసవిలో కొత్తిమీర రసం తాగడం ద్వారా శరీర ఉష్ణోగ్రత తగ్గి చల్లదనం కలుగుతుంది.
కొత్తిమీరలో ఉన్న విటమిన్ C, K చర్మాన్ని కాంతివంతంగా, ముడతలులేకుండా ఉంచుతాయి. మొటిమలు, చర్మదురదలను తగ్గిస్తాయి.
ఇందులో ఉన్న బీటా కెరోటిన్, విటమిన్ A కంటి చూపును మెరుగుపరుస్తాయి.
కొత్తిమీరలో ఉన్న ఐరన్, విటమిన్ B మెదడులో రక్తప్రసరణను పెంచి, జ్ఞాపకశక్తిని బలోపేతం చేస్తాయి.
కొత్తిమీర నీటిని తాగడం శరీరంలోని కొవ్వు దహనాన్ని వేగవంతం చేస్తుంది.
కొత్తిమీర జుట్టు రాలడాన్ని తగ్గించడంలో సహాయపడతాయి.
విటమిన్ C,యాంటీ బాక్టీరియల్ గుణాలు శరీర రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తాయి.
కొత్తిమీర ప్రత్యేక వాసన, రుచి వంటకాల రుచిని మరింత మెరుగుపరుస్తాయి.