మొల్లకెత్తిన గింజలతో.. చిగురించే ఆరోగ్యం..
మొలకెత్తిన గింజల్లో పోషకాలు అధికంగా ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది.
మొలకలలో ఎంజైములు ఎక్కువగా ఉండటం వలన ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది.
పప్పులు, శనగలు, పెసర గింజలు మొలకలుగా తింటే.. ప్రోటీన్ శరీరంలో త్వరగా గ్రహించబడుతుంది.
బరువు తగ్గడానికి ఇవి సహాయపడతాయి.
మొలకలు లోని ఫైబర్, ఎంజైములు గ్లూకోజ్ లెవెల్స్‌ను ఆయాసం లేకుండా సమతుల్యం చేస్తాయి.
మొలకలలో ఉన్న పొటాషియం, మాగ్నీషియం రక్తపోటు నియంత్రణకు సహాయపడతాయి.
యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండటంతో, ఇన్ఫెక్షన్ల నుండి రక్షణ లభిస్తుంది.
మొలకలలో ఉన్న విటమిన్ C, E చర్మ కణాలను పునరుద్ధరిస్తాయి. ముఖ కాంతి పెరుగుతుంది.
కాల్షియం, మాగ్నీషియం, ఫాస్పరస్ ఎక్కువగా ఉండటం వలన ఎముకలు బలపడతాయి.
ఐరన్ ఎక్కువగా ఉండటం వలన రక్తహీనత, అలసట సమస్యలు తగ్గుతాయి.
కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.