రాత్రి ఆలస్యంగా తినడం వల్ల అనేక రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయి. అవేంటంటే..
రాత్రి పూట శరీరం విశ్రాంతి దశలోకి వెళ్తుంది. ఈ సమయంలో భోజనం చేస్తే జీర్ణక్రియ చాలా నెమ్మదిగా జరిగి కడుపు ఉబ్బరంగా అనిపిస్తుంది.
ఆలస్యంగా తిన్న ఆహారం శక్తిగా మారే అవకాశం తక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆ క్యాలరీలు కొవ్వుగా మారి శరీరంలో పేరుకుపోతాయి.
నిద్రపోయే ముందు భోజనం చేయడం వల్ల మెదడు చురుగ్గా ఉండి.. గాఢ నిద్ర పట్టక ఇబ్బంది కలుగుతుంది.
రాత్రి ఆలస్యంగా తినడం వల్ల శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ తగ్గి, రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ ముప్పు పెరుగుతుంది.
మన శరీర జీవక్రియ సహజంగా రాత్రిపూట తగ్గుతుంది. శరీర సహజ ప్రక్రియలకు ఇది ఆటంకం కలుగుతుంది.
ఆలస్యంగా భోజనం చేయడం వల్ల రక్తపోటు, కొలెస్ట్రాల్ పెరిగే అవకాశం ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.
ఆకలిని, సంతృప్తిని నియంత్రించే 'లెప్టిన్', 'గ్రెలిన్' వంటి హార్మోన్ల పనితీరులో మార్పులు వచ్చి, అతిగా తినే అలవాటు పెరుగుతుంది.
రాత్రి సరిగ్గా అరగకపోవడం వల్ల మరుసటి రోజు ఉదయం నీరసంగా ఉండటం, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తాయి.