బాలీవుడ్ బాద్‌షా షారుక్ ఖాన్ నేటితో 57 ఏళ్లు పూర్తి చేసుకున్నారు

షారుక్ ఖాన్ తండ్రి మీర్ తాజ్ మొహమ్మద్ ఖాన్ స్వాతంత్ర్య పోరాట యోధుడు.. అప్పటి కాంగ్రెస్ నేత అబ్దుల్ గఫ్ఫర్ ఖాన్ అడుగుజాడల్లో నడిచారు

సినిమాల్లో ఎంట్రీ ఇవ్వకముందు.. 1988 నుంచి 1992 వరకు సీరియల్స్‌లో నటించి పాపులారిటీ సంపాదించుకున్నారు

షారుక్ ఖాన్ మొదటి సినిమా దీవానా (1992)

సినీ ఇండస్ట్రీలోకి రాకముందు..ఢిల్లీ దర్యాగంజ్‌లో రెస్టారెంట్ బిజినెస్ నడిపారు

షారుక్ ఖాన్ అసలు పేరు అబ్దుల్ రషీద్ ఖాన్.. కొన్ని కారణాల వల్ల షారుక్ ఖాన్‌గా మార్చుకున్నారు

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌తో షారుక్ ఖాన్‌కు ప్రత్యేక అనుబంధం ఉంది..దుబాబ్ టూరిజమ్‌కు కింగ్ ఖాన్ ఎంబాసడర్..

షారుక్ ఖాన్ నటించిన "దిల్ వాలే దుల్హనియా లేజాయేంగే" (1995) సినిమా 27 ఏళ్లుగా ఇప్పటికీ ముంబయ్‌లోని మరాథా మందిర్ థియేటర్‌లో నడుస్తోంది

చెన్నై ఎక్స్‌ప్రెస్ (2013) షారుక్ ఖాన్ కెరీర్‌లోనే అత్యధికంగా రూ.424.54 కోట్ల గ్రాస్ కలెక్షన్ చేసింది

6వేల కోట్లకు పైగా ఆస్తులతో సినీ ఇండస్ట్రీలో రిచ్చెస్ట్ యాక్టర్‌గా కొనసాగుతున్నాడు కింగ్ ఖాన్