
Full demand for NTR 100 rs Coin(Telugu news headlines today):
ఎన్టీఆర్ పేరు మీద స్మారక రూ.100 నాణెం. రాష్ట్రపతి చేతుల మీదుగా ఆవిష్కరణ. ఎన్టీఆర్ నాణెం కొనుగోలు కోసం ఆయన అభిమానులు ఆసక్తి కనబరిచారు. పేరుకు రూ.100 నాణెమే అయినా.. దాని తయారీకి రూ.5వేలకు పైనే ఖర్చు అవుతుంది. హైదరాబాద్ మింగ్ కాంపౌండ్‌లోనే ముద్రించారు. ఆ కాయిన్‌ను 5వేలకు అమ్మకానికి పెట్టారు.
స్మారక నాణెం కాబట్టి మొదట 20వేలు మాత్రమే ముద్రించారు. ఆ నాణేలన్నీ నిమిషాల్లోనే అమ్ముడైపోయాయి. ఎన్టీఆర్ నాణెం కోసం హైదరాబాద్ మింట్‌కు భారీగా భారీగా తరలివచ్చారు ఆసక్తిదారులు.
ఫుల్ డిమాండ్ ఉండటంతో.. ఒక్కొక్కరికి ఒకే నాణెం అంటూ కండిషన్ పెట్టారు. అయినా, కొన్నిగంటల వ్యవధిలోనే అన్ని కాయిన్స్ అమ్ముడైపోయాయి. 5వేలు పెట్టి ఎన్టీఆర్ 100 నాణెంను సొంతం చేసుకున్నారు.
ముద్రించిన 20వేల కాయిన్స్ అమ్ముడై పోవడంతో.. త్వరలోనే మరో 8 వేలు ముద్రిస్తామని చెప్తున్నారు మింట్ అధికారులు. ఇందుకు నెల రోజుల సమయం పడుతుందని అన్నారు.