
Rain news updates in telugu states(Telugu flash news) :
ఈశాన్య బంగాళఖాతంలో ఏర్పడిన ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో రెండు రోజులు ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ ప్రకటించింది. రాబోయే 24 గంటల్లో ఆవర్తనం బలపడి అల్పపీడనంగా మారే ఛాన్స్ ఉందని తెలిపింది. తెలంగాణలోని 18 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ పరిధిలో వచ్చే రెండురోజుల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణశాఖ ప్రకటించింది.
ఏపీలోని దక్షిణ కోస్తాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు ప్రాంతాల్లో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిందింది.
ఈశాన్య బంగాళాఖాతం పరిసరాల్లో ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని ఐఎండీ పేర్కొంది. దక్షిణ ఆంధ్రా తీరం వరకు ద్రోణి విస్తరించి ఉందని తెలిపింది. ఉత్తర బంగాళాఖాతం పరిసర ప్రాంతాల్లో మరో ఆవర్తనం ఏర్పడే అవకాశాలున్నాయని వివరించింది. వీటి ప్రభావంతో వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ ప్రకటించింది.