
Sharmila: ఆ విజువల్స్ చూసే ఉంటారుగా. షర్మిల కోపంతో ఎలా రెచ్చిపోయారో చూశారుగా. ఓ ఎస్సైని నెట్టేశారు. ఓ లేడీ కానిస్టేబుల్ చెంప చెళ్లుమనిపించారు. మరో కానిస్టేబుల్‌ను తోసేశారు. అక్కడితో అయిపోలేదు షర్మిల షో. కారులో కూర్చొని.. అడ్డుగా ఉన్న పోలీసులపైకి కారును నడపమంటూ డ్రైవర్‌కు ఆదేశాలు ఇచ్చారు. తొక్కయ్యా.. తొక్కూ.. అంటూ డ్రైవర్‌పై అరుస్తున్న విజువల్స్ అన్ని మీడియాల్లో ప్రసారమయ్యాయి. అతను కాస్త జాగ్రత్తగా నడుపుతుంటే.. షర్మిలనే స్వయంగా కారు ఎక్స్‌లేటర్ ప్రెస్ చేసే ప్రయత్నం చేస్తున్న దృశ్యాలు వైరల్ అయ్యాయి. అందుకే, కారుతో ఢీకొట్టి కానిస్టేబుల్‌ను గాయపరిచారని కేసు నమోదు చేశారు పోలీసులు.
షర్మిలకు అంత కోపమెందుకు? రాజకీయాల్లో ఉన్నప్పుడు, అందులోనూ కెమెరాల్లో రికార్డు అవుతున్నప్పుడు ఇంకెంత జాగ్రత్తగా ఉండాలి? అడ్డుపడినందుకు ఆవేశపడి.. ఇప్పుడు కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది. ఆమెకు మైలేజ్ రావడం కంటే.. డ్యామేజే ఎక్కువ జరిగింది. అంతా షర్మిల తీరును తప్పుబడుతున్నారు. రాయలసీమ కల్చర్ తెలంగాణకు తీసుకొస్తున్నారని మండిపడుతున్నారు. సోషల్ మీడియాలో షర్మిల బిహేవియర్ గురించి ఘోరంగా ట్రోలింగ్ జరుగుతోంది.
రాజన్న బిడ్డనంటూ పదే పదే చెప్పుకునే షర్మిల.. ఆ తండ్రి నాయకత్వ లక్షణాలను పూర్తిగా పునికిపుచ్చుకోలేక పోయిందంటున్నారు. వైఎస్సార్ రాజకీయంగా ఎంత ఖతర్నాక్‌గా ఉన్నా.. పైకి మాత్రం పూర్తి శాంతిస్వరూపం. తన తండ్రిని చంపిన వారినే క్షమించానని.. తనలోని కోపం నరం ఎప్పుడో తెగిపోయిందని.. స్వయంగా ఆయనే అసెంబ్లీలో ఓ సందర్భంలో అన్నారు. ఆ డైలాగ్ ఫుల్ ఫేమస్ అయింది. యంగ్ లీడర్‌గా ఉన్నప్పుడు ఏమోకానీ.. ఆయన రాష్ట్రస్థాయి నేతగా అవతరించాక మాత్రం వైఎస్సార్ అంటే కూల్ పర్సన్ అనేలానే మీడియా ముందు కనిపించేవారు. షర్మిలలా ఇలా రెచ్చిపోయిన ఘటనలు దాదాపు లేవు.
వైఎస్సార్ వరకూ ఎందుకు.. జగన్ సైతం అంతే. జగన్ కోపిష్టి అనే వారూ ఉన్నారు. యంగ్ ఏజ్‌లో ఓ ఎస్సైని కూడా కొట్టారని అంటారు. కానీ, రాజకీయాల్లోకి వచ్చాక తెరమీద మాత్రం ఎప్పుడూ చిరునవ్వు చెదరనియ్యరు. విశాఖ ఎయిర్‌పోర్టులో తనపై కత్తితో దాడి జరిగినప్పుడు కూడా ఆయన ముఖంపై నవ్వు కనిపించింది. అంతెందుకు, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, విశాఖ విమానాశ్రయంలో పోలీసులు ఆయన్ను అడ్డుకున్నప్పుడు.. రన్‌వే పైనే బైఠాయించి నిరసన తెలిపారు. మీరు అడ్డుకుంటున్నది కాబోయే సీఎంను.. అంటూ పోలీసులను హెచ్చరించారే కానీ ఎక్కడా అదుపు తప్పి ప్రదర్శించలేదు. కానీ, జగనన్న చెల్లి మాత్రం తనను అడ్డుకున్నారనే ఆవేశంలో పోలీసులపై దాడి చేసి.. ఇప్పుడు ప్రజల ముందు దోషిగా నిలబడాల్సి వచ్చింది. అదీ తేడా.
వైఎస్సార్, జగన్‌లు రాటుదేలిన రాజకీయ నేతలు. షర్మిల ఇప్పుడిప్పుడే సొంతంగా రాజకీయ ఓనమాలు దిద్దుతున్నారు. అందుకే ఇలా ఎదురుదెబ్బలు తింటున్నారు. అయితే, తప్పుల నుంచి నేర్చుకునే నైపుణ్యం ఆమెకు ఉందంటున్నారు. ప్రజా సమస్యలపై పోరాటాలతో, సర్కారు తీరుపై పదునైన విమర్శలతో ఇన్నాళ్లూ మెప్పించిన షర్మిల.. ఇలా చిన్నచిన్న మిస్టేక్స్‌తో దొరికిపోతున్నారు. పాదయాత్ర అంటే పాదాల మీద చేసే యాత్ర అంటూ ట్రోలర్స్‌కు చిక్కుతున్నారు. లేటెస్ట్ ఎపిసోడ్‌లో పోలీసులను కొట్టడం తప్పే అయినా.. ఓవరాల్‌గా కొంతకాలంగా షర్మిల చేస్తున్న పోరాటం, రాజకీయం మెచ్చుకోదగినదే అంటున్నారు. తన వెనుక బలం, బలగం లేకపోయినా.. సివంగిలా సింగిల్‌గానే సమరం చేస్తున్నారు. కేసీఆర్ సర్కారు, పోలీసుల నుంచి ఎంతగా స్పీడ్ బ్రేకర్లు ఎదురవుతున్నా.. షర్మిల స్పీడు ఏమాత్రం తగ్గడం లేదు. ఇటీవల నిరుద్యోగ సమస్యలపై కలిసిపోరాడుదాం రమ్మంటూ.. బండి సంజయ్, రేవంత్‌రెడ్డిలకు ఆమె ఫోన్ చేసి ప్రతిపాదించడం.. షర్మిలలోని రాజకీయ పరిణీతికి నిదర్శనమనే చెప్పాలి. మంచిగా మైలేజ్ వస్తున్న సమయంలో.. ఇలా కోపాన్ని కంట్రోల్ చేసుకోలేకపోయి ఖాకీలను కొట్టి.. ఎరక్కపోయి ఇరుక్కోవడం పొలిటికల్‌గా మైనస్.

Revanth Reddy: కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు.. ధరణిపై రేవంత్ వార్నింగ్