
Gold:- కేంద్రం బంగారం అమ్ముతోంది. ఎంత గొప్ప అడ్వర్టైజ్ మెంట్స్ ఇచ్చినా.. బయటి షాపుల్లో కొనే బంగారంలో స్వచ్ఛత ఉంటుందన్న నమ్మకం ఉండదు చాలామందికి. అలాంటి అనుమానాలు, భయాలు ఉన్నవాళ్లు… కేంద్ర ప్రభుత్వం అమ్మే బంగారం కొనుక్కోవడం ఉత్తమం. కేంద్రం అమ్మే బంగారానికి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్ హాల్ మార్క్ ఉంటుంది. కాయిన్స్ 24క్యారెట్ల గోల్డ్‌తో 99.9 శాతం స్వచ్ఛత ఉంటుంది.
పైగా కాయిన్స్ కొంటే ఎన్నేళ్లైనా సరే.. వాటి మెరుపును కోల్పోవు. పైగా ఏళ్లు గడుస్తున్న కొద్దీ మార్కెట్ విలువ పెరుగుతూనే ఉంటుంది. పైగా ఆభరణాల కంటే బంగారు నాణేలనే సులభంగా అమ్ముకోవచ్చు. కావాలంటే తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు.
అక్షయ తృతీయ సందర్భంగా కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలో పలు మింట్ కార్యాలయాల్లో సామాన్యులు బంగారం, వెండి కొనుగోలు చేసేలా ఏర్పాట‍్లు చేసింది. దేశవ్యాప్తంగా 5 మెట్రో నగరాల్లో మింట్ ఆఫీసులు ఉన్నాయి. హైదరాబాద్‌లో చర్లపల్లి ఐడీఏ ఫేజ్ 2, ఢిల్లీలో జవహార్ వాయిపర్ భవన్ జన్ పథ్, నోయిడా డీ-2 సెక్టార్ 1, ముంబైలో షాహిద్ భగత్ సింగ్ రోడ్, కోల్‌కతా అలిపోరిలో మింట్ కేంద్రాలున్నాయి.
ఎవరైనా సరే… గోల్డ్ కాయిన్స్, సిల్వర్ కాయిన్స్ కొనుగోలు చేయాలంటే కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన మింట్ కేంద్రాలకు వెళ్లొచ్చు. ఈ మింట్ ఔట్‌లెట్లలో 5 గ్రాములు, 10 గ్రాములు, 50 గ్రాములు బంగారం కొనొచ్చు. కొనుగోలుదారులకు రెండు ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి ఫిజికల్‌గా కొనొచ్చు. వెళ్లేంత సమయం లేకపోతే.. ఆన్ లైన్లోనూ కొనుగోలు చేయొచ్చు. ఆన్‌లైన్‌లో కొనాలంటే www.indiagovtmint.in.లో ఆర్డర్ పెట్టాలి.