
Reliance Empire:- ఇండియాలో అంబానీల గురించి తెలియని వారుండరు. రిలయన్స్ సంస్థ అంతలా చొచ్చుకెళ్లింది. ధీరూబాయ్ అంబానీ వారసత్వాన్ని ముకేశ్ అంబానీ, అనిల్ అంబానీ పంచుకున్నారు. అనిల్ అంబానీ పెద్దగా వార్తల్లో ఉండకపోయినా.. ముకేశ్ అంబానీ మాత్రం వ్యాపారాల పరంగా వార్తల్లో నిలుస్తుంటారు. ప్రపంచ కుబేరుల జాబితాలో మిగతా వాళ్లతో పోటీపడుతుంటారు. అలాంటి కంపెనీలో జరిగే పరిణామాలు ఎప్పటికీ కీలకమే. అందరికీ ఆసక్తి కూడా. ముకేశ్ అంబానీ వ్యాపారాల వారసులు ఎవరా అని. ముకేశ్ కంపెనీల వ్యవహారాలు ఎవరు చూస్తున్నారో అందరికీ తెలిసిందే. కాకపోతే, వాళ్లు ఎలా పర్ఫామ్ చేస్తున్నారో, కంపెనీపై తమ బ్రాండ్ ఎలా వేస్తున్నారో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు.
కేవలం భారతదేశంలో మాత్రమే కాకుండా ఆసియాలో అత్యంత ధనవంతుడిగా కీర్తి పొందిన ‘ముఖేష్ అంబానీ’ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వ్యాపార ప్రపంచంలో తిరుగులేని వ్యాపారవేత్తగా ముందుకు సాగుతున్న ఈ అపర కుబేరుడు రిలయన్స్ ఇండస్ట్రీస్ మాత్రమే కాకుండా.. పెట్రోకెమికల్స్, ఆయిల్ అండ్ గ్యాస్, టెలికాం రంగాల్లో కూడా తనదైన ముద్ర వేశారు.
ఆకాశ్ అంబానీ. ఈయన ముఖేష్ అంబానీ పెద్ద కొడుకు. ప్రస్తుత రిలయన్స్ జియో చైర్మన్ కూడా. దేశంలోనే అతి పెద్ద టెలికాం సంస్ధ జియో.. ప్రస్తుతం ఆకాష్ కంట్రోల్‌లోనే ఉంది. అంతేకాదు.. ఆకాశ్ అంబానీ.. ముంబై ఇండియన్స్ జట్టుకు కో-ఓనర్ కూడా. మొదట్లో జియో ఇన్ఫోకామ్‌లో స్ట్రాటజీ చీఫ్‌గా ఆకాశ్ అంబానీ కెరీర్ ప్రారంభించారు. ఇప్పుడు ఛైర్మన్ పొజిషన్‌లో ఉన్నారు. ప్రస్తుతం ఆకాశ్ అంబానీ ఆస్తుల విలువ 40 బిలియన్ డాలర్లు.
ఇషా అంబానీ.. ముఖేష్, నీతా అంబానీల కలల రాణి. ఒక్కగానొక్క అమ్మాయి. ప్రస్తుతం రిలయన్స్ రిటైల్ వ్యాపారాన్ని దగ్గరుండి నడిపిస్తున్నారు ఇషా అంబానీ. మిలియనీర్ ఆనంద్ పిరమల్‌ను వివాహం చేసుకున్నా.. రిలయన్స్ రిటైల్ బాధ్యతలు చూస్తోంది. ప్రస్తుతం ఇషా అంబానీ ఆస్తుల విలువ 100 మిలియన్ డాలర్ల కంటే ఎక్కువ.
అనంత్ అంబానీ. ముఖేష్ అంబానీ పిల్లల్లో చిన్నవాడు. అనంత్ అంబానీకి రిలయన్స్ న్యూ ఎనర్జీ కంపెనీ బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రిలయన్స్ 02C & రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీకి డైరెక్టర్ పదవిలో ఉన్నారు అనంత్. ఆయన ఆస్తుల విలువ సుమారు 40 బిలియన్ డాలర్లు.