
Saving Schemes : నెలకు మంచి వడ్డీ ఇచ్చే స్కీమ్‌లు చాలా ఉన్నాయి. వీటిలో అన్నిటికంటే బెస్ట్ స్కీమ్.. సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్. వీటిల్లో పెట్టుబడి పెట్టి దాదాపు 12 లక్షల రూపాయల వరకు సంపాదించొచ్చు. సీనియర్ సిటిజన్స్ 30 లక్షల వరకు పొదుపు చేసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతిచ్చింది. పైగా ఈ స్కీమ్‌పై 8.2 శాతం వరకు వడ్డీ ఇస్తోంది. ఇతర స్కీమ్స్ అందించే వడ్డీ కన్నా ఇదే ఎక్కువ.
పోస్టాఫీస్ లేదా బ్యాంక్‌కు వెళ్లి ఈ స్కీమ్‌లో చేరొచ్చు. ఎందులో చేరినా ఒకే రకమైన వడ్డీ లభిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరిన వారికి ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద ట్యాక్స్ మినహాయింపు కూడా పొందొచ్చు. అందువల్ల ట్యాక్స్ బెనిఫిట్‌తో పాటు రాబడి కూడా పొందొచ్చు.
ఈ స్కీమ్ కాలపరిమితి 5 ఏళ్లు. అంటే 30 లక్షల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే.. మెచ్యూరిటీ సమయంలో 42.3 లక్షలు వస్తాయి.
అంటే వడ్డీ రూపంలో ఏకంగా 12.3 లక్షలు వస్తాయని అర్థం. మూడు నెలలకు ఒకసారి మీరు 61, 500 రూపాయలు పొందొచ్చు. అంటే నెలకు 20 వేల చొప్పున పొందుతున్నట్లు లెక్క.
లేదంటే ఒకేసారి మెచ్యూరిటీ సమయంలో భారీ మొత్తం పొందొచ్చు.
అంటే మీకు వడ్డీ రూపంలో ఏకంగా 12.3 లక్షలు వస్తాయన్న మాట.