Elon Musk's : కక్ష్యలోకి వెళ్లని శాటిలైట్స్.. లక్ష కోట్లు కోల్పోయిన బిలియనీర్.. మరి మస్క్ సంగతేంటి?

Elon Musk’s : కక్ష్యలోకి వెళ్లని శాటిలైట్స్.. లక్ష కోట్లు కోల్పోయిన బిలియనీర్.. మరి మస్క్ సంగతేంటి?

Elon Musk's
Share this post with your friends

Elon Musk's

Elon Musk’s : శాటిలైట్ బిజినెస్‌కు ఇప్పుడు ఫుల్ క్రేజ్. భూకక్ష్యలో సురక్షితంగా ఉపగ్రహాలను చేర్చే కంపెనీలకు ఫుల్ డిమాండ్. ఇప్పుడు టెలికాం కంపెనీలు, డీటీహెచ్ కంపెనీలకు శాటిలైట్స్‌తోనే పని వీటి కోసం కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేస్తున్నాయి. ప్రైవేట్ కంపెనీలతో ఉపగ్రహాలు తయారుచేయించుకుని.. స్పేస్ ఎక్స్ లేదా ఇతర ప్రైవేట్ రాకెట్ లాంచ్ కంపెనీ ద్వారా శాటిలైట్స్ పంపిస్తున్నాయి. అవి సక్సెస్ అయి కక్ష్యలోకి వెళ్తే… కంపెనీలకు ప్రాఫిట్స్. కంపెనీ షేర్ల ధరలు కూడా అమాంతం పెరుగుతాయి. అలా కాదని.. రాకెట్ లాంచ్ ఫెయిల్ అయితే మాత్రం ఊహించని స్థాయిలో నష్టాలు తప్పవు. మరో రకంగా చెప్పాలంటే దివాళా తీయాల్సిందే.

ఎలన్ మస్క్ స్టార్ షిప్ రాకెట్ ఫెయిల్ అవడంతో.. గతంలో ఇలా శాటిలైట్స్ పంపించడానికి ప్రయత్నించి ఫెయిల్ అయిన ఓ కంపెనీ గురించి చెప్పుకుంటున్నారు.

400 కంపెనీలకు బాస్ అయిన రిచర్డ్ బ్రాన్సన్… తన శాటిలైట్ లాంచ్ సంస్థ వర్జిన్ ఆర్బిట్ ఫెయిల్ అయినందుకు పూర్తిగా దివాళా తీశారు. స్టార్ట్ అప్ మీ పేరుతో ఒకేసారి 9 ఉపగ్రహాలు కక్ష్యలో ప్రవేశపెట్టేందుకు లూనార్ వర్స్ మాడిఫైడ్ 747 జెట్ ఉపయోగించింది. లాంచింగ్ బాగానే జరిగినా.. ఉపగ్రహాలను మాత్రం కక్ష్యలో ప్రవేశపెట్టలేకపోయింది. దీంతో రిచర్డ్ బ్రాన్సన్ ఆస్తులు మొత్తం కరిగిపోయాయి. రాకెట్ లాంచ్ ఫెయిల్ అవడంతో.. ఆ కంపెనీ షేర్లు 38 శాతం పడిపోయాయి. దీనివల్ల జరిగిన నష్టం దాదాపు లక్ష కోట్ల రూపాయలు. ఒక్క ప్రయోగం విఫలం అవడంతో ఇంత భారీ నష్టాన్ని ఎదుర్కొన్న వ్యక్తి మరొకరు లేరు. ఈ నష్టాన్ని భర్తీ చేసుకునేందుకు కంపెనీ ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది. చివరికి 85 శాతం మంది ఉద్యోగులను తీసేశారు. అయినా సరే… నష్టాల నుంచి కోలుకోకపోవడంతో.. రిచర్డ్ బ్రాన్సన్ యుఎస్ దివాలా కోర్టులో ఐపీ పెట్టేందుకు రెడీ అవుతున్నారు.

మొన్న 20వ తేదీన ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్ కూడా స్టార్ షిప్ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. నింగిలోకి వెళ్లిన నిమిషాల్లోనే ఆ రాకెట్ పేలిపోయింది. ఈ రాకెట్ ప్రయోగానికి ఎలన్ మస్క్ చేసిన ఖర్చు దాదాపు 25 వేల కోట్ల రూపాయలు. అంత ఇన్వెస్ట్ చేసి ప్రయోగం చేస్తే నిమిషాల్లోనే రాకెట్ బూడిదైంది. అయితే, రిచర్డ్ బ్రాన్సన్ కంపెనీపై రియాక్ట్ అయినట్టుగా ఎలన్ మస్క్ కంపెనీపై రియాక్ట్ అవడం లేదు ఇన్వెస్టర్స్. ఈ రాకెట్ ప్రయోగం ఫెయిల్ అవడానికి 50 శాతం ఛాన్సెస్ ఉన్నాయని ముందుగానే చెప్పుకొచ్చారు మస్క్. పైగా ఇలాంటి ప్రయోగానికే మరో రాకెట్ సిద్ధంగా ఉంచినట్టు చెప్పుకొచ్చారు. సో, స్పేస్ ఎక్స్ కంపెనీకి వచ్చిన నష్టమేం లేదు. 


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Elon Musk : మస్క్‌కు షాకిచ్చిన ఎఫ్‌డీఏ

Bigtv Digital

Keeda Cola Movie Updates : ‘కీడా కోలా’ టీజర్ ఔట్.. క్రైమ్‌తో తరుణ్ భాస్కర్ కామెడీ..

Bigtv Digital

Afridi peace mantra: అఫ్రీదీ శాంతి మంత్రం.. అక్తర్, షమికి ఉపదేశం..

BigTv Desk

Flights: విమానంలో కొట్లాట.. మహిళపై మూత్రవిసర్జన.. ఆకాశంలో అరాచకాలు

Bigtv Digital

Unstoppable : క్రేజీ ఎపిసోడ్‌ షూటింగ్‌ షురూ… అన్‌స్టాపబుల్‌లోకి పవర్ స్టార్ ఎంట్రీ..

Bigtv Digital

Perni Nani press meet: చంద్రబాబుకు 118 కోట్ల లంచం.. ఐటీ నోటీసులపై పేర్ని ప్రశ్నలు

Bigtv Digital

Leave a Comment