
Hotelier India : భారత హోటల్ రంగంలో అవకాశాలెన్నో. 65 బిలియన్ డాలర్లుగా ఈ రంగం విలువ 2047 నాటికి 1504 బిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా.హోటల్ రంగం పురోగతి రానున్న 25 ఏళ్లలో విపరీతమైన డిమాండ్ ఉంటుందని హోటల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సర్వేలో వెల్లడైంది.
అయినా ఈ రంగాన్ని పలు సవాళ్లు వెన్నాడుతున్నాయి. ఇంధన ఖర్చులు, పన్నుల భారం వాటిలో ప్రధానమైనవి.
ఇంధన వ్యయం భరించలేనంతగా పెరిగిందని 74% రెస్పాండెంట్లు తెలిపారు. పన్నులూ అధికమేనని 73% మంది తేల్చేశారు.
సిబ్బంది జీతాలకు ఎక్కువ వ్యయమవుతోందని 68% చెప్పారు. ఆర్థిక అనిశ్చితులతో కుదేలవుతున్నామని 61% అభిప్రాయపడ్డారు. పెట్టుబడుల ఇబ్బందులు(60%), స్థిరాభివృద్ధి(58%), ఇన్‌పుట్స్-సేవల వ్యయం పెరుగుదల(56%) వంటివి కూడా శాపాలుగా మారాయి.
పోటీదారులు పెరిగారని 53% రెస్పాండెంట్లు చెప్పారు. వినియోగదారుల ఊహలు, అంచనాలను అందుకోలేకపోతున్నట్టు 52% స్పష్టం చేశారు. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, మౌలిక వసతుల కల్పన వంటివి పర్యాటక, ఆతిథ్యరంగాలకు ఊపునిస్తాయి. దాంతో పర్యాటకులు పెరిగి హోటల్ రంగం కళకళలాడుతుంది.