Cars Sales : కార్లు కొనడంలో మనోళ్లే టాప్.. నిమిషానికి 9 కార్లు.. 1.3 ట్రిలియన్ టర్నోవర్

Cars Sales : కార్లు కొనడంలో మనోళ్లే టాప్.. నిమిషానికి 9 కార్లు.. 1.3 ట్రిలియన్ టర్నోవర్

Share this post with your friends

Cars Sales : సొంత ఇల్లు, సొంతకారు కొనుక్కోవాలనేది ప్రతి ఒక్కరి కల. వాటిని సాకారం చేసుకునేందుకు శతవిధాల కష్టపడతారు. చివరికి తమ కలను నెరవేర్చుకుంటారు. సొంతింటి కల తీరగానే.. సొంతకారు కావాలన్న కోరిక ఉంటుంది. ప్రత్యేకంగా పండుగల సీజన్ లో వాహనాల కొనుగోళ్లు ఎక్కువగా జరుగుతుంటాయి. అలా ఈ ఏడాది ఆగస్టు నుంచి నవంబర్ 15 వరకూ జరిగిన కార్ల కొనుగోళ్లలో భారతీయులు సరికొత్త రికార్డు సృష్టించారు. మెజారిటీ రాష్ట్రాల్లో.. ఓనం నుంచి భాయ్ దూజ్ (భగినీ హస్తభోజనం) వరకూ మూడు నెలల పండుగల సీజన్లలో ఏకంగా 1.03 మిలియన్ కార్లు అమ్ముడైనట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది.

ఈ మూడునెలల కాలంలో వాహన తయారీదారులు రూ.1.1 లక్షల కోట్లకు పైగా టర్నోవర్ ను సాధించగా.. భారత్ కు రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు వచ్చాయి. ఈ ఏడాది అక్టోబర్ చివరి నాటికి Maruti Suzuki WagonR 22,080 యూనిట్లు అమ్ముడవ్వగా, సుజుకి స్విఫ్ట్ 21,600, టాటా నెక్సాన్, 15,325 యూనిట్లు, సుజుకీ బాలెనో 18,417 యూనిట్లు, సుజుకి బ్రెజా 15,001 యూనిట్లు అమ్ముడైనట్లు మార్కెట్ వర్గాలు పేర్కొన్నాయి. ఆగస్టు నెల నుంచి దసరా నవరాత్రులు ముగిసేసరికి కార్ల పరిశ్రమ 18 శాతానికి పైగా వృద్ధిని నమోదు చేసింది. ఈ సీజన్ లో 7 లక్షల యూనిట్ల కార్ల అమ్మకాలు జరిగాయని అంచనా. గతేడాది ఫెస్టివల్ సీజన్లో అమ్మకాలు.. 8.1 నుంచి 8.5 లక్షల యూనిట్లుగా ఉండగా.. ఈ ఏడాది ఇది 20-25 శాతానికి పెరిగింది.

కార్లు భారీగా అమ్ముడు పోవడంపై.. మారుతీ సుజుకి సేల్స్ అండ్ మార్కెటింగ్ సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, సేల్స్ అండ్ మార్కెటింగ్, శశాంక్ శ్రీవాస్తవ మాట్లాడుతూ.. ఫెస్టివల్ సీజన్ లో మొదటిసారిగా 1 మిలియన్ డెలివరీలను చేసి.. రికార్డు సృష్టించామన్నారు. హ్యుందాయ్ మోటార్ ఇండియా యొక్క COO, తరుణ్ గార్గ్ మాట్లాడుతూ.. గడిచిన రెండేళ్లకు.. ఈ పండుగ సీజన్‌లో తేడా ఏమిటంటే డీలర్‌షిప్‌ల వద్ద వాహనాలు తగినన్ని స్టాక్‌లు ఉండటమేనన్నారు. “పండుగల సమయంలో అక్కడికక్కడే కారును కొనుగోలు చేయాలనుకునే కస్టమర్ల ద్వారానే ఈ రికార్డు సాధ్యమైందన్నారు. గ్రోత్ ఊహించిన దాని కంటే మెరుగ్గా ఉందని గార్గ్ అంగీకరించారు. 2023కి 8 శాతం వృద్ధి రేటు చాలా చాలా మంచి శకునం అని తెలిపారు.


Share this post with your friends

ఇవి కూడా చదవండి

Telangana Formation Day: ఎన్నాళ్లో వేచిన ఉదయం.. అలా తెలంగాణంలో..

Bigtv Digital

Sharmila : రాహుల్‌ గాంధీకి బర్త్ డే విషెస్.. ఆసక్తిగా షర్మిల ట్వీట్ .. కాంగ్రెస్ వైపు అడుగులు..?

Bigtv Digital

IND vs AUS: మనోళ్లు గెలిచేనా? ఆస్ట్రేలియాతో టఫ్ ఫైట్!

Bigtv Digital

Bandi Sanjay: గడీలు బద్దలయ్యేలా నిరుద్యోగ మార్చ్.. కేటీఆర్‌ రాజీనామా చేయాలన్న బండి సంజయ్

Bigtv Digital

Chevella : పోస్టల్ బ్యాలెట్ కోసం.. చేవెళ్లలో ఉద్యోగుల నిరసన

Bigtv Digital

Suriya : 42వ మూవీ టైటిల్‌ ‘కంగువ’.. అర్థమేంటో తెలుసా..?

Bigtv Digital

Leave a Comment