
Musk Tweet : ఈ ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ – హమాస్ ల మధ్య మొదలైన యుద్ధానికి ఇంకా తెరపడలేదు. దాడులు, ప్రతిదాడులతో ఇజ్రాయెల్ – పాలస్తీనా దేశాలు అట్టుడికిపోతున్నాయి. ఈ క్రమంలో సోషల్ మీడియా వేదికగా వస్తున్న వ్యతిరేక పోస్టులపై.. X యజమాని ఎలాన్ మస్క్ మద్దతు పలకడం తీవ్రదుమారం రేపుతోంది. మస్క్ తీరుపై అమెరికా కూడా తీవ్రంగా మండిపడుతోంది. అతని తీరుతో విసిగిన అగ్రరాజ్యానికి చెందిన ప్రముఖ దిగ్గజ కంపెనీలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. యాపిల్, డిస్నీ వంటి సంస్థలు X లో తమ యాడ్స్ ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
యూదులు, తెల్లజాతీయులను కించపరిచేలా ఓ యూజర్ పెట్టిన పోస్ట్ కు మస్క్ స్పందిస్తూ..సరిగ్గా చెప్పారని బదులివ్వడం తీవ్రవిమర్శలకు దారితీసింది. ఈ వ్యవహారంపై అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్ తీవ్రంగా స్పందించింది. మస్క్ స్పందన యూదు కమ్యూనిటీని ప్రమాదంలో పడేస్తోందని మండిపడింది. ఫలితంగా కొన్ని దిగ్గజ సంస్థలు X లో తమ యాడ్లను నిలిపివేయాలని నిర్ణయించాయి.
యాపిల్, ఐబీఎం, ఒరాకిల్, కామ్ కాస్ట్, బ్రావో టెలివిజన్ నెట్ వర్క్, యూరోపియన్ కమిషన్స్, లయన్స్ గేట్ ఎంటర్టైన్ మెంట్ కార్పొరేషన్, వాల్ట్ డిస్నీ, పారామౌంట్ గ్లోబల్, వార్నర్ బ్రోస్ డిస్కవరీ వంటి సంస్థలు ఎక్స్ వేదికగా తమ యాడ్స్ ప్రసారాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. మరోవైపు టెస్లా నుంచి కూడా మస్క్ పై వ్యతిరేకత వ్యక్తమవుతున్నట్లు సమాచారం. టెస్లా సీఐఓ పదవి నుంచి ఆయన్ను సస్పెండ్ చేయాలని ఆ కంపెనీ వాటాదారులు కొందరు డిమాండ్ చేస్తున్నట్లు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. మస్క్ ఇలానే వ్యవహరిస్తే X ను త్వరలోనే షట్ డౌన్ చేసే పరిస్థితి వస్తుందని హెచ్చరిస్తున్నారు.
Bandla Ganesh Comments: ప్రజల చూపు కాంగ్రెస్ వైపే.. తెలంగాణలో అధికారం ఖాయం..