
Parag Desai Death : వేల కోట్ల రూపాయల టర్నోవర్ ఉన్న వాఘ్ బక్రి టీ గ్రూప్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పరాగ్ దేశాయ్ (49)పై కుక్కలు దాడి చేశాయని, అందువల్లే ఆయన చనిపోయారంటూ సోమవారం మీడియాలో కథనాలు వచ్చాయి. కానీ.. ఆయన కుక్కలు దాడి చేయడం వల్ల చనిపోలేదని తాజాగా వైద్యులు వెల్లడించారు. అక్టోబర్ 15వ తేదీన గుజరాత్ లోని అహ్మదాబాద్ లో తన ఇంటి వద్ద వాకింగ్ కు వెళ్లిన పరాగ్ దేశాయ్ ను కుక్కలు వెంబడించాయి. ఆ పై దాడి చేశాయి. ఈ దాడిలో పరాగ్ కిందపడగా.. తలకు బలమైన గాయమైంది.
వెంటనే కుటుంబ సభ్యులు అహ్మదాబాద్ లోని షాల్బీ ఆసుపత్రికి తరలించారు. ఒక రోజు తర్వాత జైడస్ అనే మరో ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరాగ్ దేశాయ్ ఆదివారం (అక్టోబర్ 22) మృతిచెందారు. కాగా.. తమ ఆసుపత్రికి తీసుకొచ్చినపుడు పరాగ్ శరీరంపై ఎలాంటి గాట్లు లేవని, అపస్మారక స్థితిలో ఉన్నారని షాల్బీ ఆసుపత్రి వైద్యులు తెలిపారు. పరాగ్ కు చికిత్స చేసిన వైద్యులు అతడికి ద్వైపాక్షిక ఫ్రంటల్ సబ్ డ్యూరల్ హెమటోమా (acute subdural hematoma with bilateral frontal confusion) ఉన్నట్లు నిర్థారించారు. 72 గంటల పాటు అబ్జర్వేషన్ లో ఉంచాలని చెప్పగా.. బంధువులు డిశ్చార్జ్ చేసి తీసుకెళ్లారని షాల్బీ ఆసుపత్రి సీఐఐ నిషితా శుక్లా తెలిపారు. దీనిని బట్టి చూస్తే.. పరాగ్ దేశాయ్ చనిపోయింది కుక్కల దాడిలో కాదని తెలుస్తోంది. కుక్కలు దాడిచేయడంతో కిందపడిన ఆయన తలకు బలమైన గాయం కావడం వల్లే పరాగ్ కన్నుమూశారని వైద్యులు పేర్కొన్నారు.
పరాగ్ దేశాయ్ వ్యాపార సామ్రాజ్యం
పరాగ్ దేశాయ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్న వాఘ్ బక్రీ టీ గ్రూప్ ను ఆయన తండ్రి నరసన్ దాస్ దేశాయ్ 1892లో ప్రారంభించారు. ఆ తర్వాత వాఘ్ బక్రీ భారత్ లోనే అతిపెద్ద ప్యాకేజ్డ్ టీ బ్రాండ్ గా మార్చడంలో పరాగ్ కీలక పాత్ర పోషించారు. సంస్థ అమ్మకాలు, ఎగుమతి, మార్కెటింగ్ వంటి వాటిలో తనవంతు పాత్ర పోషించారు. తన తెలివితేటలతో వాఘ్ బక్రీ ని ప్రపంచవ్యాప్తంగా విస్తరిస్తూ వెళ్లారు. ప్రస్తుతం ఈ కంపెనీ టర్నోవర్ రూ.2000 కోట్లు.
Revanth Reddy on KCR : పాలమూరుకు ఇచ్చిన హామీల సంగతేంటి? కేసీఆర్ కు రేవంత్ ప్రశ్నలు..