
Dividend Funds : సేఫ్ ఇన్వెస్ట్‌మెంట్, ట్యాక్స్ బెనిఫిట్స్‌తో పాటు 30 శాతం రిటర్న్స్ రావాలనుకుంటే డివిడెండ్ ఫండ్స్ ప్రయత్నించవచ్చు. బ్యాంక్ డిపాజిట్స్, పోస్టాఫీస్‌లో డబ్బులు పెట్టి… మంచి ఆదాయాన్ని కోల్పోయే బదులు డివిడెండ్ ఈల్డ్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టొచ్చు. రికార్డ్స్ ప్రకారం.. ఈ ఫండ్స్ మొదటి ఏడాదిలో 10 శాతం.. మూడేళ్లలో 30 శాతం లాభాలు అందించాయి.
మార్కెట్లో టాప్ డివిడెండ్ ఈల్డ్ ఇచ్చే ఫండ్స్ ఏంటంటే.. ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ డివిడెండ్ ఈల్డ్ ఈక్విటీ ఫండ్, టెంపుల్టన్ ఇండియా ఈక్విటీ ఇన్‌కమ్ ఫండ్, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్, హెచ్‌డీఎఫ్‌సీ డివిడెండ్ ఈల్డ్ ఫండ్, యూటీఐ డివిడెండ్ ఈల్డ్ ఫండ్, ప్రిన్సిపల్ డివిడెండ్ ఈల్డ్ ఫండ్ ఇన్వెస్టర్లకు 30 శాతానికి తక్కువ కాకుండా రిటర్న్స్ అందించాయి.
ఇన్వెస్ట్ మెంట్ పరంగా వీటి కంటే మంచి లాభాలు ఇచ్చిన ఫండ్స్ చాలానే ఉన్నాయి. కాకపోతే.. సేఫ్ రిటర్న్స్ కావాలనుకునే వారు మాత్రం వీటిని ట్రై చేయొచ్చు. స్టాక్ మార్కెట్లు పడిపోయినప్పటికీ… ఈ డివిడెండ్ ఫండ్స్ మాత్రం స్థిరంగా రాబడిని అందిస్తున్నాయి. పైగా గత 8 నెలలుగా స్టాక్ మార్కెట్ సూచీలు పెద్దగా పెరిగింది లేదు. సో, ఈ సమయంలో కాస్తో కూస్తో రిటర్న్స్ ఇచ్చినవి ఇవే. అందుకే, పెద్దగా వీటి వైపు చూడని వాళ్లు కూడా… ఈమధ్య డివిడెండ్ ఫండ్స్ వైపు చూస్తున్నారు, పెట్టుబడి పెడుతున్నారు.
స్టాక్ మార్కెట్లోని అన్ని కంపెనీలు డివిడెండ్స్ ఇవ్వవు. కాకపోతే, గవర్నమెంట్ సెక్టార్లోని కంపెనీలు మాత్రం కచ్చితమైన డివిడెండ్స్ ఇస్తాయి. ఈ షేర్లు పెద్దగా పెరగకపోయినా.. ఇన్వెస్టర్ల కోసం డివిడెండ్స్ పంచుతుంటాయి. ముఖ్యంగా బీపీసీఎల్, సెయిల్, భెల్, హిందుస్తాన్ ఏరోనాటిక్స్, ఇంజినీర్స్ ఇండియా, కోల్ ఇండియా వంటి స్టాక్స్ డివిడెండ్స్ ప్రకటిస్తుంటాయి.
YCP Leaders Comments: బేరం ఫిక్స్.. వైసీపీ రియాక్షన్స్..