
Real Estate : మీరు ప్లాట్ లేదా ఫ్లాట్ కొనబోతున్నారా? అయితే.. ఆ స్థిరాస్తి వివరాలన్నీ తెలుసుకున్నాకే.. అడ్వాన్స్ ఇవ్వాలంటున్నారు రియల్‌ఎస్టేట్ నిపుణులు. స్థిరాస్తి కొనుగోళ్లలో మోసాలు పెరగటంతో కొనుగోలుకు ముందే దాని డాక్యుమెంట్లు వెరిఫై చేసుకోమని సలహా ఇస్తున్నారు. ఇంతకూ ఆ పత్రాలేంటో చూద్దాం.
పత్రాల జాబితా..
1. మీరు కొనబోయే ఆస్తి.. ప్రస్తుత యజమానికి ఎలా వచ్చిందని రుజువుచేసే అమ్మకపు దస్తావేజు.
2.ఒకవేళ.. ఆ వ్యక్తికి ఈ ఆస్తి కొనుగోలు ద్వారా కాకుండా వీలునామా,గిఫ్ట్ డీడ్ రూపంలో వస్తే ఆ టైటిల్ డీడ్స్.
3.ఆస్తికి సంబంధించిన లింకు డాక్యుమెంట్లు చూసుకుని, ఇప్పటి వరకు ఆ ఆస్తి ఎందరి చేతులు మారిందో తెలుసుకోవాలి.
4.ఆస్తిని అమ్మే వ్యక్తి పేరుతో ఉన్న.. సబ్ రిజిస్టార్ లేదా పంచాయితీ రికార్డుల మ్యుటేషన్ పత్రం.
5.ఒకవేళ.. ఫ్లాట్ కొంటుంటే.. జాయింటు డెవలప్‌మెంటు అగ్రిమెంటు కాపీ.
6.ఒక్కోసారి అసలు ఓనరు ఒకరైతే.. అమ్మే హక్కు (పవర్ ఆఫ్ అటార్నీ) మరొకరికి ఉంటుంది. కనుక దాని పత్రాలు.
ప్లానింగ్ విభాగం వారి బిల్డింగ్ ప్లాను, అప్రూవ్డ్ ప్లాన్, అధికారులిచ్చిన ఎన్‌వోసీ, విద్యుత్ శాఖ, నీటి శాఖ పత్రాలు చెక్ చేయాలి.
7.ముఖ్యంగా 4 లేదా ఆ పై అంతస్తుల ఫ్లాట్ కొనేవారికి ఇది చాలా ముఖ్యం.
8.ఒరిజినల్ అగ్రిమెంటు,ఉంటే.. దాని సప్లిమెంటరీ అగ్రిమెంట్లు కూడా చూసుకోవాలి. అపార్ట్‌మెంట్ కట్టేముందు.. స్థల యాజమాని, బిల్డర్ మధ్య రాసుకున్న అగ్రిమెంటు, బిల్డర్ ఫ్లాటును అప్పగిస్తూ ఇచ్చే పత్రం, అమ్మే వ్యక్తి కొన్నప్పటి చెల్లింపుల కాగితాలు, రశీదులు.
9.కొనబోయే స్థిరాస్తిని.. ప్రస్తుత యాజమాని బ్యాంకులోనులో కొంటే..ఆ బ్యాంకు రుణ పత్రాలు, మున్సిపల్ పన్నులు, కరెంటు, వాటర్ బిల్లులు,ఇతర పెనాల్టీలు, చెల్లింపులు, సొసైటీ మెంబర్‌షిప్ కాగితాలు, వారి ఎన్‌వోసీ పత్రాలు చూసుకోవాలి.
10.చివరగా.. సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో విచారణ చేసి ఈ ఆస్తి గత, ప్రస్తుత విలువ ఎంతని తెలుసుకుంటే.. బ్యాంకు రుణంపైనా ఒక అంచనాకు రావచ్చు.