
Punjab Sindh Bank:- ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను వరుసగా పెంచుతున్నాయి బ్యాంకులు. ప్రజల దగ్గర డబ్బులు ఉండడం, స్టాక్ మార్కెట్లు ప్రస్తుత పరిస్థితుల్లో ఆశించినంత రిటర్న్స్ ఇవ్వకపోవడంతో.. డిపాజిట్లు సేకరించడానికి ఇదే కరెక్ట్ టైం అని భావిస్తున్నాయి బ్యాంకులు. దీంతో పోటీ పడి మరీ వడ్డీరేట్లు పెంచుతున్నాయి. అయినా సరే.. కాంపిటిషన్ పెరగడంతో.. కస్టమర్లను ఆకర్షించడానికి స్పెషల్ డిపాజిట్ స్కీమ్స్ తీసుకొస్తున్నాయి. ఇందులో భాగంగానే పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ తన కస్టమర్ల కోసం ఒకే సారి రెండు పథకాలు తీసుకొచ్చి సర్‌ప్రైజ్ ఇచ్చింది. బ్యాంకులో డబ్బులు దాచుకుని ఎక్కువ రాబడి కోరుకునే వారికి ఇది మంచి అవకాశం.
గవర్నమెంట్ బ్యాంకింగ్ సెక్టార్‌లో ఒకటైన పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్.. 2 కోట్ల రూపాయల లోపు ఉన్ని ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను సవరించింది. 7 రోజుల నుంచి 10 రోజుల మెచ్యూరిటీ ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లపై జనరల్ కస్టమర్లకు 2.80 శాతం నుంచి 6.25 శాతం వరకు వడ్డీ రేట్లు ఆఫర్ చేస్తోంది.
400 రోజులు, 601 రోజుల స్పెషల్ టెన్యూర్ డిపాజిట్ల ద్వారా కస్టమర్లకు 7.10 శాతం, 7 శాతం వడ్డీ రేట్లను ఆఫర్ చేస్తోంది. ఈ వడ్డీ రేట్లు ఏప్రిల్ 20, 2023 నుంచే అమలులోకి వచ్చాయి.
* 7 రోజుల నుంచి 30 రోజుల టెన్యూర్ ఫిక్స్‌డ్ డిపాజిట్లపై ఈ బ్యాంక్ 2.80 శాతం వడ్డీ ఆఫర్ చేస్తోంది.
* 31 రోజుల నుంచి 45 రోజుల టెన్యూర్ డిపాజిట్లపై 3 శాతం వడ్డీ అందిస్తోంది.
* 46 రోజుల నుంచి 90 రోజుల మెచ్యూరిటీ పీరియడ్ గల డిపాజిట్లపై 4.60 శాతం వడ్డీ లభిస్తోంది.
* 91 రోజుల నుంచి 179 రోజుల టెన్యూర్లపై 4.75 మేర వడ్డీ అందిస్తోంది.
* 180 రోజుల నుంచి 364 రోజుల మెచ్యూరిటీ డిపాజిట్లకు 6 శాతం, ఏడాది నుంచి 399 రోజులకు 6.40 శాతం వడ్డీ అందిస్తోంది.
* 400 రోజుల స్పెషల్ ఎఫ్‌డీలపై జనరల్ కస్టమర్లకు 7.10 శాతం వడ్డీ ఇస్తోంది.
* 401 రోజుల నుంచి 554 రోజుల మెచ్యూరిటీ డిపాజిట్లపై 6.40 శాతం వడ్డీ అందిస్తోంది.
* 555 రోజుల మెచ్యూరిటీ డిపాజిట్లపై 7.35 శాతం వడ్డీ కల్పిస్తోంది.
* 556 రోజుల నుంచ 600 రోజుల డిపాజిట్లకు 6.40 శాతం వడ్డీ ఉంది.
* 601 రోజుల స్పెషల్ ఎఫ్‌డీపై గరిష్ఠంగా 7 శాతం వడ్డీ ఇస్తోంది.
* 602 రోజుల నుంచి రెండేళ్ల టర్మ్ డిపాజిట్లపై 6.40 శాతం వడ్డీ లభిస్తోంది.
* రెండేళ్ల నుంచి 3 ఏళ్ల డిపాజిట్లకు 6.75 శాతం, మూడేళ్ల నుంచి 10 ఏళ్ల కాలానికి 6.5 శాతం వడ్డీ లభిస్తోంది.
400 రోజులు, 601 రోజుల స్కీమ్స్ జూన్ 30, 2023 వరకు మాత్రమే అందుబాటులో ఉంటాయి. ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూ.2 కోట్లలోపు ఉన్న సీనియర్ సిటిజన్లకు అదనంగా 50 బేసిస్ పాయింట్లు వడ్డీ రేటు కల్పిస్తామని తెలిపింది. అలాగే సూపర్ సీనియర్ సిటిజన్లకు అదనంగా మరో 15 బేసిస్ పాయింట్ల వడ్డీ అందిస్తోంది.