
Once Startups Are Now Unicorns:- మార్కెట్ వాల్యూ వన్ బిలియన్ డాలర్ ఉన్న ప్రతి కంపెనీని యూనికార్న్ అనే అంటారు. రూపాయల్లో చెప్పాలంటే.. 8వేల కోట్ల రూపాయల మార్కెట్ వర్త్ ఉంటే.. దాన్ని యూనికార్న్ కంపెనీగా గుర్తిస్తారు. ఏ దేశంలో యూనికార్న్ స్టార్టప్స్ ఎక్కువగా ఉంటాయో.. ఆ దేశమే వరల్డ్ లీడర్‌షిప్ తీసుకుంటుందని అర్థం. ఇండియా ఈ యూనికార్న్స్ విషయంలో వరల్డ్‌లోనే మూడో ప్లేస్‌లో ఉంది.
హురున్ రీసెర్చ్ రిపోర్ట్ ప్రకారం, గ్లోబల్‌గా టాప్ 100 యూనికార్న్‌ల లిస్టులో ఇండియా నుంచి ఐదు స్టార్టప్‌లు చోటు దక్కించుకున్నాయి. బైజూస్ 22 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో ఇండియాలోనే అత్యంత విలువైన యూనికార్న్‌గా ఉంది. గ్లోబల్‌గా బైజూస్‌కు 14 వ స్థానం. ఎడ్‌టెక్ సెక్టార్ నుంచి టాప్ 20 యూనికార్న్‌లలో ఉన్నది కూడా బైజూసే. ఇండియా నుంచి సెలెక్ట్ అయిన మరో రెండు కంపెనీలు స్విగ్గీ, డ్రీమ్ 11. 8 బిలియన్ డాలర్లతో డ్రీమ్11, స్విగ్గీలు 84వ ప్లేస్ పంచుకున్నాయి. గేమింగ్ కంపెనీల్లో ఇండియా తరపున టాప్ 100 లిస్టులో చోటు దక్కించుకున్న ఒకే ఒక్క కంపెనీ డ్రీమ్11.
ఇక ఓలా 94వ స్థానంలో ఉంది. ఈ కంపెనీ వాల్యుయేషన్ 7.5 బిలియన్ డాలర్లు. రేజర్‌పే కూడా 7.5 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో 94వ ప్లేస్‌లో నిలిచింది. గతేడాదితో పోల్చితే ఈ కంపెనీ ర్యాంక్ 136 స్థానాలు ఎగబాకింది.
ప్రపంచవ్యాప్తంగా 48 దేశాల్లో 1,361 యూనికార్న్ కంపెనీలు ఉన్నాయి. వీటి మొత్తం విలువ 4.3 ట్రిలియన్ డాలర్లు. ఈ మొత్తం యూనికార్న్‌లలో 666 స్టార్టప్స్ ఒక్క అమెరికాలోనే ఉన్నాయి. 316 యూనికార్న్‌లతో చైనా సెకండ్ ప్లేస్‌లో ఉంది. 68 యూనికార్న్‌లతో ఇండియా మూడో ప్లేస్‌లో నిలిచింది. ఉన్నాయి.
టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ బైట్‌డ్యాన్స్ యూనికార్న్స్‌లో ఫస్ట్ ప్లేస్‌లో ఉంది. ఈ కంపెనీ వాల్యుయేషన్ 200 బిలియన్ డాలర్లు. ఇక ఎలన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్ 137 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో రెండో స్థానంలో ఉంది. చాట్‌జీపీటీ 20 బిలియన్ డాలర్ల వాల్యుయేషన్‌తో 17 వ స్థానానికి చేరుకుంది.