
Stock Market : స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టేవారికి అంతో ఇంతో రిస్క్ తప్పదనేది ఆర్థిక నిపుణులు చెప్పేమాట. షేర్ మార్కెట్ లాభాలు అనేక అంశాలమీద ఆధారపడి ఉంటాయి. కనుక కాస్త రిస్క్ పెరిగితేనే దీర్ఘకాలంలో మంచి లాభాలుంటాయని షేర్ మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. కొందరు తామ వద్ద ఉన్న షేర్ విలువ పడిపోవటం మొదలుకాగానే వెంటనే ఆ స్టాక్‌లను అమ్మేస్తుండగా, మరికొందరు వాటిని దీర్ఘకాలంలో లాభిస్తాయనే నమ్మకంతో అలాగే ఉంచేస్తుంటారు.
నిజానికి.. బలమైన ఆర్థిక మూలాలున్న కంపెనీల స్టాక్స్ తాత్కాలికంగా నష్టాల్లో ఉన్నా.. అవి దీర్ఘకాలంలో ఫలించే ఛాన్స్ ఎక్కువ.అయితే.. ఏ ప్యూచర్ ప్లాన్ లేని, స్తబ్దతగా ఉన్న కంపెనీల షేర్లు చాలాకాలం నుంచి నష్టాల్లో ఉంటే వాటిని వదిలించుకోవటమే మంచిది.
వడ్డీ రేటు, ఈక్విటీ, కమోడిటీ, కరెన్సీ అనే అంశాల ను బట్టి మార్కెట్ రిస్క్ ఆధారపడి ఉంటుంది. దేశీయంగా అయితే.. వీటిలో వడ్డీరేటు ప్రధాన ప్రమాణం. అందుకే.. బలమైన ఆర్థిక మూలాలు, వైవిధ్యమైన రంగాల్లో దీర్ఘకాలంగా, నిలకడగా సాగుతున్న కంపెనీల స్టాక్స్ కొనుక్కోవటం మంచిదని, అప్పుడు రిస్క్ తక్కువని మార్కెట్ పండితుల మాట. కనుక ఏదైనా స్టాక్‌లో పెట్టుబడి పెట్టుబడి పెట్టేముందు.. దాని మూలాలు, యాజమాన్యం ఆలోచనలు, మార్కెట్లో దాని పోటీదారులు వంటి వివరాలను ఆరా తీయటం వల్ల మరింత స్పష్టత వస్తుందని వారు చెబుతున్నారు