
Wow.. phone battery is full in less than 10 minutes!
స్మార్ట్ ఫోన్ కంపెనీ రియల్ మీ… ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ ఛార్జింగ్ ఫోన్ విడుదల చేసింది. మొబైల్ వరల్డ్ కాంగ్రెస్-2023లో జీటీ సిరీస్‌లో భాగంగా కొత్త జీటీ3 స్మార్ట్ ఫోన్ లాంచ్ చేసిన రియల్ మీ… ఇది కేవలం 10 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అవుతుందని చెబుతోంది. 240 వాట్స్ ఫాస్ట్‌ఛార్జింగ్ సపోర్ట్‌తో వస్తున్న తొలి ఫోన్ ఇదేనని, దీని ద్వారా 4,600 ఎంఏహెచ్ బ్యాటరీని కేవలం 10 నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్ చేయొచ్చని పేర్కొంది.
REAL ME GT3 ని ఐదు వేరియంట్లలో తీసుకురానుంది… రియల్ మీ. ర్యామ్, మెమొరీ స్పెషిఫికేషన్లు 8జీబీ-128జీబీ, 12జీబీ-256జీబీ, 16జీబీ-256జీబీ, 16జీబీ- 512జీబీ, 16జీబీ-1టీబీగా ఉండబోతున్నాయి. అయితే ధరల శ్రేణిని మాత్రం ప్రకటించలేదు… రియల్ మీ. అంచనాల ప్రకారం… భారత మార్కెట్లో బేస్ వేరియంట్ ధరే రూ.53 వేలకు పైగా ఉండొచ్చని చెబుతున్నారు. ఈ ఫోన్ ఎప్పటి నుంచి మార్కెట్లో అందుబాటులో ఉంటుందనే విషయాన్ని కూడా రియల్ మీ వెల్లడించలేదు.
ఇక రియల్ మీ జీటీ3 ఇతర స్పెసిఫికేషన్లు చూస్తే… ఆండ్రాయిడ్ 13, యూఐ 4.0తో… 6.74 అంగుళాల 1.5కె అమోలెడ్, 144Hz రీఫ్రెషర్ రేటు కలిగిన డిస్‌ప్లే ఇచ్చారు. ఆక్టాకోర్ స్నాప్‌డ్రాగన్ 8+ జనరేషన్ ప్రాసెసర్ వినియోగించారు. వెనుక వైపు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 890 సెన్సర్ కెమెరా, 8 ఎంపీ అల్ట్రావైడ్ యాంగిల్ కెమెరా, 2 ఎంపీ మైక్రో సెన్సర్ కెమెరా ఉన్నాయి. సెల్ఫీల కోసం ముందు భాగంలో 16 ఎంపీ కెమెరాను ఇచ్చారు.
జీటీ3లో ఉన్న రెండు స్పెషాలిటీస్ ఏంటంటే… ఒకటి ఫాస్ట్ ఛార్జింగ్, రెండు ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్. ఇందులోని 4,600 ఎంఏహెచ్ బ్యాటరీ 240 వాట్స్ సూపర్‌వూక్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. కేవలం నాలుగు నిమిషాల్లోనే 50 శాతం బ్యాటరీ, 9.3 నిమిషాల్లోనే 100 శాతం బ్యాటరీ ఛార్జ్ అవుతుందని రియల్ మీ చెబుతోంది. ఇక వెనుక వైపు ఆర్‌జీబీ ఎల్‌ఈడీ ప్యానెల్ ఏకంగా 25 రంగులు వెలువరిస్తుంది. కాల్స్, నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఎల్‌ఈడీ అలర్ట్ వస్తుంది. యూజర్లు తమకు నచ్చినట్లుగా రంగుల్ని మార్చుకునే అవకాశం ఉంది.
- FOR MORE UPDATES BIGTV