
Jammu and Kashmir : జమ్మూ కశ్మీర్ లో చేపట్టిన యాంటీ టెర్రర్ ఆపరేషన్ లో ఐదుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. ఈ ఎన్ కౌంటర్ లో భద్రతా బలగాలు ఐదుగురు ఉగ్రవాదులను మట్టుపెట్టాయి. కశ్మీర్ లోని కుల్గామ్ జిల్లా నెహామా ప్రాంతంలో ఉగ్రవాదులను గుర్తించిన బలగాలు.. వారిని మట్టుపెట్టాయి. మృతి చెందిన వారిని లష్కరే తొయిబా ఉగ్రవాద సంస్థకు చెందిన వారిగా గుర్తించారు.
నెహామా ప్రాంతంలో ముష్కరులు ఉన్నారన్న సమాచారంతో నిన్నటి నుంచి సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తున్నారు. సైన్యం రాకను గుర్తించిన ఉగ్రవాదులు వారిపై కాల్పులకు తెగబడ్డారు. ఘటన స్థలానికి అదనపు బలగాలు కూడా చేరుకున్నారు. ఆ ప్రాంతం మొత్తాన్ని చుట్టుముట్టారు. ప్రస్తుతం సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోంది.
కొన్ని రోజులుగా యాక్టివ్‌గా లేని ఉగ్రవాదులు.. ఈ మధ్య మళ్లీ బరి తెగిస్తున్నారు. ఇటీవల ఓ కూలీని కాల్చి చంపారు. దాల్ లేక్‌లో జరిగిన పడవల ప్రమాదం వెనుక కూడా కుట్ర కోణం ఉందన్న అనుమానాలు ఉన్నాయి. దీంతో భారత్ ఆర్మీ సరిహద్దుల్లో నిఘాను మరింత పెంచింది.