
Mine Fire Accident : కజకిస్థాన్ లో ఉన్న గనుల్లో పనిచేసేవారికి దినదిన ప్రాణగండం ఉంటుంది. ఎప్పుడు ఎక్కడ పేలుడు సంభవిస్తుందో.. ఎంతమంది ప్రాణాలు గాల్లో దీపంలా ఆరిపోతాయో తెలీదు. తాజాగా అలాంటే షాకింగ్ ఘటనే జరిగిందక్కడ. కోస్టెంకో గనిలో సంభవించిన అగ్నిప్రమాదంలో 32 మంది మృతి చెందగా.. మరో 18 మంది ఆచూకీ తెలియడంలేదని ఆ దేశ అత్యవసర పరిస్థితుల మంత్రిత్వశాఖ వెల్లడించింది.
లక్సెంబర్గ్ కు చెందిన స్టీల్ మేకర్ కు చెందిన స్థానిక యూనిట్ ఆపరేషన్ ఆర్సెలర్ మిట్టల్ టెమిర్టౌ ఈ ఘటనపై మాట్లాడుతూ.. కోస్టెంకో గనిలో మొత్తం 252 మంది పని చేస్తున్నట్లు తెలిపారు. వారిలో 206 మంది వర్కర్లు మీథేన్ పేలుడు తర్వాత బయటకు వచ్చారని, 18 మందికి వైద్యం అవసరమైందని తెలిపారు.
ఈ ఘటనపై కజకిస్థాన్ అధ్యక్షుడు కస్సిమ్-జోమార్ట్ టోకాయేవ్ దిగ్భ్రాంతి చెందారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. గని అగ్నిప్రమాదంలో మరణించినవారి ఆత్మలకు శాంతి చేకూరాలని అక్టోబర్ 29న జాతీయ సంతాప దినాన్ని ప్రకటించారు. వెంటనే ఆర్సెలార్ మిట్టల్ టెమిర్టౌతో పెట్టుబడి సహకారాన్ని నిలిపివేయాలని తన మంత్రివర్గానికి ఆదేశాలు జారీ చేశారు.
“ఆర్సెలార్ మిట్టల్ టెమిర్టౌ భవిష్యత్తుకు సంబంధించి రెండు పార్టీలు చర్చలు జరుపుతున్నాయని, రిపబ్లిక్ ఆఫ్ కజాఖ్స్తాన్‌కు యాజమాన్యాన్ని బదిలీ చేసే ఒక లావాదేవీకి సంబంధించిన ప్రాథమిక ఒప్పందంపై ఇటీవల సంతకం చేశాయని కజకిస్తాన్ ప్రభుత్వం ఈరోజు ముందుగా తెలియజేసినట్లు ఆర్సెలార్ మిట్టల్ ధృవీకరించగలదు.” అని మైన్ అధికారి ఒకరు చెప్పారు.