
Bank Manager Murder: ఒక బ్యాంక్ మెనేజర్‌ను హత్య (Murder) చేసి.. అతడి మృతదేహాన్ని 17 గంటలపాటు ఇంట్లోనే దాచారు. మరుసటి రోజు ఏమీ జరగనట్టు ఇంట్లో విందుభోజనం చేసి.. ఆ తరువాత కులాసాగా.. బ్యాంక్ మెనేజర్ ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులకు హంతుకులు ఫోన్ చేశారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రం ఆగ్రా (Agra) నగరంలో జరిగింది.
ఆగ్రా నగరంలోని ఒక బ్యాంక్ మెనేజర్‌గా పనిచేస్తున్న సచిన్ ఉపాధ్యాయ్ ఆత్మహత్య చేసుకొని చనిపోయారని అక్టోబర్ 12 రాత్రి పోలీసులకు ఫోన్ వచ్చింది. పోలీసులు వెంటనే బ్యాంక్ మెనేజర్ ఇంటికి చేరుకొని ప్రశ్నిస్తుండగా.. మృతుడి భార్య ప్రియాంక స్పృహ తప్పి పడిపోయింది. ఆమెను వెంటనే ఆస్పత్రికి తరలించారు. మరుసటిరోజు ఆమె ఆస్పత్రి నుంచి మిస్సింగ్ అని పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులకు అనుమానం కలిగింది.
బ్యాంక్ మెనేజర్ సచిన్ ఉపాధ్యాయ్ మరణం అక్టోబర్ 11 రాత్రి జరిగిందని పోస్టుమార్టం రిపోర్టులో తేలింది. కానీ పోలీసులకు మరుసటి రోజు అంటే సచిన చనిపోయిన దాదాపు 17 గంటల తరువాత ఫోన్ వచ్చింది. పైగా మృతుడి భార్య ఆస్పత్రి నుంచి మిస్సింగ్. ఇది ఆత్మహత్య కాదు హత్య అని పోలీసులు అనుమానించారు. వెంటనే బ్యాంక్ మెనేజర్ ఇంటి చుట్టుపక్కల వారిని ప్రశ్నించి సమాచారం సేకరించారు. సచిన్ ఇంట్లో ఇద్దరు మహిళలు పనిమనుషులుగా ఉన్నారని తెలిసింది.
దీంతో పోలీసులు ఆ ఇద్దరినీ విచారణ చేశారు. వారిలో ఒకరు వంటమనిషి కాగా, మరొకరు ఇంట్లో క్లీనింగ్ చేసేవారు. వంట మనిషి చెప్పిన దాని ప్రకరాం.. అక్టోబర్ 12, అంటే హత్య జరిగిన మరుసటి రోజు మృతుడి భార్య ప్రియాంక మంచి భోజనం అది కూడా రోజు చేసేదాని కంటే ఎక్కవ చేయమని చెప్పింది. ఆ తరువాత ప్రియాంక తన ఫోన్ పనిచేయడం లేదని పక్కింటి వారిని అడిగి ఒక ఫోన్‌కాల్ చేసింది. పోలీసులు పక్కింటి వారి సెల్ ఫోన్ పరిశీలించగా.. ప్రియాంక తన తండ్రికి రెండుసార్లు ఫోన్ చేసినట్లు తేలింది.
పోలీసులు ప్రియాంక, ఆమె తండ్రి గురించి విచారణ చేయగా.. వారిద్దరూ పరారీలో ఉన్నట్లు తెలిసింది. పైగా ఇంతకు ముందు ప్రియాంక తన భర్త, అత్తమామలపై కట్నంవేధింపుల కేసు పెట్టిందనే విషయం కూడా బయటపడింది. వారిద్దరి కోసం వెతుకుతున్న పోలీసులకు ప్రియాంక సోదరుడు చిక్కాడు. అతడిని పోలీసులు తమ పద్ధతిలో ప్రశ్నించారు. అప్పుడు అతను నిజం చెప్పాడు.
అక్టోబర్ 11 రాత్రి ప్రియాంక తన సోదరుడితో కలిసి తన భర్త సచిన్ ఉపాధ్యాయ్‌ని హత్య చేసింది. కానీ సచిన్ మరణాన్ని ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు వారిద్దరూ ప్లాన్ చేశారు. ఇద్దరూ కలిసి హత్య జరిగినట్ల ఆధారాలన్నీ మాయం చేశారు. వారిద్దరికీ ఈ ప్లాన్ చెప్పింది ప్రియాంక తండ్రి. అయితే సచిన శవాన్ని ఇంట్లోనే దాచిపెట్టి.. ఏమీ జరగనట్లు ప్రియాంక ప్రవర్తించింది. మరుసటి రోజు ఇంటికి పనిమనుషులు వచ్చినప్పుడు వారితో విందుభోజనం చేసుకొని సచిన చావుని పండుగలా జరుపుకుంది.
ప్రస్తుతం పోలీసులు ప్రియాంక, ఆమె సోదరుడు, తండ్రిపై హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Revanth Reddy: కేసీఆర్ కుటుంబానికి జైల్లో డబుల్ బెడ్‌రూం ఇల్లు.. ధరణిపై రేవంత్ వార్నింగ్