
Jubilee hills crime : జూబ్లీహిల్స్ పబ్లిక్ స్కూల్ మాజీ ఛైర్మన్‌తోపాటు ఆయన కొడుకు ఆకాష్‌పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు పోలీసులు. దళిత యువతిపై దాడి చేసిన ఘటనలో వీరిద్దరిపై కేసు నమోదు చేశారు. పనిమనిషిపై అత్యాచారానికి పాల్పడిన మురళీ ముకుంద్‌పై పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేశారు. అత్యాచారానికి గురైనప్పటి నుంచి బాధితురాలిని భరోసా సెంటర్‌లోనే ఉంచారు.
కాగా.. తాజాగా మురళీముకుంద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను నాంపల్లి జడ్జి ఇంటికి తీసుకెళ్లి.. హాజరుపరిచారు. జడ్జి మురళీముకుంద్ కు రిమాండ్ విధించారు. మురళీ ముకుంద్ సెల్ ఫోన్, పాస్ పోర్ట్ ను సీజ్ చేశారు. మురళీముకుంద్ కొడుకు ఆకాష్ పరారీలో ఉండటంతో.. అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ ఏడాది జూన్ లో బాధిత యువతి మురళీముకుంద్ ఇంటిలో పనికోసం చేరింది. పనిలో చేరిన 15 రోజుల తర్వాత తనకు వేధింపులు మొదలయ్యాయని పోలీసులకు వివరించింది. లైంగిక దాడి చేయడమే కాకుండా.. శారీరకంగా హింసించారని యువతి వాపోయింది.
KCR : విశ్వగురువు కాదు.. విషగురువు.. మోదీపై కేసీఆర్ ఘాటు విమర్శలు