
Himaja : బిగ్‌బాస్ ఫేమ్, సినీనటి హిమజపై ఎన్నికల నిబంధనల ఉల్లంఘన కేసు నమోదైంది. ఇబ్రహీంపట్నంలోని జేబీ ఇన్‌ఫ్రా వెంచర్స్‌లోని ఆమె ఇంట్లో మిడ్‌నైట్ పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో పలువురు సెలబ్రిటీలు పాల్గొన్నారు. పక్కా సమాచారంతో అర్థరాత్రి 1:30 గంటలకు మహేశ్వరం SOT పోలీసులు రైడ్ చేశారు. పోలీసుల ఎంట్రీతో షాక్ అయిన హిమజ.. దీపావళి సందర్భంగా పార్టీ చేసుకుంటున్నామని వారికి వివరణ ఇచ్చారు. ఎలక్షన్ కోడ్‌కు విరుద్ధంగా పార్టీ ఏర్పాటు చేసినందుకు హిమజపై మహేశ్వరం పోలీసులు కేసు నమోదు చేశారు. హిమజతో పాటు మరికొందరిపై ఎక్సైజ్ చట్టం లోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున పోలీసులు ఆమె ఇంట్లో 15 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. బీఆర్‌ఎస్ ఎన్నికల ప్రచార పాటను ఇటీవలే హిమజ సోషల్ మీడియాలో ప్రమోట్ చేశారు.
.
.
.