
Teacher Nude photos : విద్యార్థులకు విద్యాబుద్దులు నేర్పించాల్సిన ఓ టీచర్ దారుణంగా ప్రవర్తించింది. తన న్యూడ్ ఫొటోలను, వీడియోలను తన వద్ద చదువుకునే ఒక టీనేజ్ విద్యార్థికి పంపింది. తనతో శృంగారంలో పాల్గొనడానికి ఇంటికి కూడా పిలిచింది. కానీ అక్కడే విషయం తేడా కొట్టింది. ఈ ఘటన అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో జరిగింది.
అయితే, ఈ విషయం బయటకు రావడంతో 16 ఏళ్ల విద్యార్థికి నగ్న చిత్రాలు, వీడియోలు పంపినందుకు ఆ టీచర్ అరెస్టు అయింది. ఈ ఘటన అమెరికాలో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే.. అమెరికాలోని మిస్సోరీకి సెయింట్ జేమ్స్ హై స్కూల్‌లో రిక్కీ లిన్(24) అనే యువతి ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. ఆ స్కూల్‌లో చదువుకుంటున్న ఒక 16 ఏళ్ల అబ్బాయితో ఆమె సన్నిహితంగా ఉండేది. ఒక రోజు ఆ అబ్బాయితో ఫోన్‌లో చాట్ చేస్తూ తన నగ్న ఫోటోలను పంపమని అడిగింది. ఆ టీనేజ్ అబ్బాయి తన నగ్న ఫోటోలు పంపించాడు. ఆ తరువాత టీచర్ రిక్కీ లిన్ కూడా తన నగ్న ఫోటోలను పంపించింది.
ఈ క్రమంలోనే ఆమె ఆ అబ్బాయిని తన ఇంటికి పిలిచి తనతో శృంగారంలో పాల్గొనమని చెప్పింది. కానీ అబ్బాయి అందుకు అంగీకరించలేదు. దీంతో కోపం పట్టలేక ఆ అబ్బాయిపై గట్టిగా అరిచింది. వెంటనే తన నగ్న ఫొటోలను డిలీట్ చేయమని అడిగింది. ఆ అబ్బాయి అక్కడి నుంచి పారిపోయి స్కూల్ యజమాన్యానికి ఫిర్యాదు చేశాడు. దీంతో ఈ విషయం పోలీసుల వరకు వెళ్లింది.
టీచర్ రిక్కీ లిన్‌ను పోలీసులు విచారణ చేయగా.. ఆమె తన నగ్న చిత్రాలను పంపిన విషయం వాస్తవమేనని అంగీకరించింది. కానీ ఆ టీనేజర్ ఒక మైనర్ అనే విషయం తనకు తెలియదని చెప్పింది.
అమెరికాలోని మిస్సోరీ రాష్ట్రంలో మైనర్లపై అత్యాచార యత్నం, వారికి పోర్నోగ్రఫీ మెటీరియల్ (నగ్న ఫోటోలు, వీడియోలు) అందించడం తీవ్రమైన నేరం. ఆ రాష్ట్రంలో చట్టప్రకారం మేజర్ కావాలంటే 17 ఏళ్లు పూర్తవ్వాలి. కానీ ఈ కేసులో ఆ టీనేజర్ వయస్సు 16 ఏళ్లు.
ప్రస్తుతం టీచర్ రిక్కీ లిన్‌ను పోలీసులు అరెస్టు చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. కోర్టు ఆమెకు జైలు శిక్షతో పాటు లక్ష డాలర్ల జరిమానా విధించింది.