Vikarabad Crime: కారణాలు ఏమైనా కావచ్చు. ఇంటి యజమాని.. భార్య, కూతురు, వదినను కత్తితో పీక కోసి చంపేశాడు. ఆ తర్వాత అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఫ్యామిలీ సమస్యల కారణంగా ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. సంచలనం రేపిన ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో వెలుగుచూసింది. అసలేం జరిగింది? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..
వికారాబాద్ జిల్లాలో దారుణం
వికారాబాద్ జిల్లా కులకచర్ల మండలంలో దారుణమైన ఘటన చోటు చేసుకుంది. యాదయ్య-అలివేలు దంపతులు. వీరి కాపురం మొదట్లో బాగానే సాగింది. వీరికి ఇద్దరు ఆడ పిల్లలు ఉన్నారు. అపర్ణకు 13 ఏళ్లు కాగా, శ్రావణికి 10 ఏళ్లు. పిల్లలు పెద్దవుతున్న క్రమంలో ఫ్యామిలీలో చిన్నపాటి సమస్యలు మొదలయ్యాయి. రోజు రోజుకు సమస్యలు పెరగడంతో భార్యభర్తల మధ్య తరచు విభేదాలు మొదలయ్యాయి.
ప్రతీ రోజూ గొడవలు జరగడంతో విసిగిపోయాడు యాదయ్య. వీరి విషయంలో ఇరు కుటుంబాల పెద్దలు జోక్యం చేసుకుని సర్ది చెప్పారు. అయినా గొడవలు తగ్గలేదు. ఇదిలా ఉండగా శనివారం అలువేలు ఇంటకి ఆమె అక్క హన్మమ్మ వచ్చింది. వీరి మధ్య గొడవలకు ఫుల్‌స్టాప్ పెట్టే ప్రయత్నం ఆమె చేసింది. అవేమీ ఫలించలేదు.
భార్య, కూతురు, వదినను కత్తితో పీక కోసి
అర్థరాత్రి కుటుంబసభ్యులు నిద్రపోతున్న సమయంలో వేట కొడవలితో ఒక్కసారిగా భార్య గొంతు కోసి చంపేశాడు యాదయ్య. ఆ తర్వాత వదినను కిరాతకంగా నరికి చంపాడు. చివరకు ఇద్దరు ఆడపిల్లలను చంపే ప్రయత్నంలో పెద్ద కూతురు అపర్ణ ఇంటి నుంచి తప్పించుకుని పోలీసుల వద్దకు వెళ్లింది. ఆ సమయంలో యాదయ్య ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు.
ALSO READ: హుస్సేన్ సాగర్‌లో గుర్తు తెలియని యువతి మృతదేహం
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. అప్పటికే యాదయ్య మృతి చెందారు. తీవ్రంగా గాయపడిన అపర్ణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. డెడ్ బాడీలను స్వాధీనం చేసుకున్న పోలీసులు, పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యలకు కారణమని పోలీసులు భావించారు.
పరిగి డీఎస్పీ శ్రీనివాస్ హత్య జరిగిన ప్రాంతానికి వెళ్లారు. కేసు నమోదు చేసిన పోలీసులు, వారి బంధువులకు సమాచారం ఇచ్చారు. ఈ ఘటన వెనుక కారణం ఏంటి? అనే విషయాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. అపర్ణ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటోంది.
https://twitter.com/bigtvtelugu/status/1984796498207654072