
Yemen Kerala Nurse : ఉపాధి కోసం యెమెన్ దేశం వెళ్లిన భారత నర్సుకు ఆ దేశ ట్రయల్ కోర్టు మరణ శిక్ష విధించింది. ఆమె ఒక యెమెన్ పౌరుడిని హత్య చేసినందున ఈ శిక్ష విధించడమైనది. తాజాగా యెమెన్ సుప్రీం కోర్టులో ఆమె మళ్లీ అపీల్ చేయగా.. దానిని ఆ దేశ అత్యున్నత కోర్టు తిరస్కరించింది. ఇప్పుడామె శిక్ష నుంచి తప్పించుకోవాలంటే ఒకటే దారి.
కేరళలోని పాలక్కడ్ కు చెందిన నిమిష ప్రియ నర్సింగ్ కోర్సు పూర్తి చేసి ఉపాధి కోసం యెమెన్ దేశానికి వెళ్లింది. తన భర్త, కొడుకుతో అక్కడే స్థిరపడింది. 2014లో ఆమె భర్త, కొడుకు భారత దేశానికి తిరిగి వచ్చేశారు. కానీ ఆమె అక్కడే ఉండి తన సొంత క్లినిక్ ప్రారంభించాలనుకుంది. ఇందుకోసం అక్కడి పౌరుడు తలాల్ అబ్దో మెహది సహాయం తీసుకుంది. యెమెన్ దేశ చట్ట ప్రకారం ఏదైనా సంస్థ ప్రారంభించాలన్నా లేక వ్యాపారం చేయలన్నా.. అక్కడి పౌరుల భాగస్వామ్యం తప్పనిసరి
అలా 2015 సంవత్సరంలో తలాల్ సహాయంలో ఆమె తన క్లినిక్ ప్రారంభించింది. కానీ వారిద్ధిరి మధ్య ఆర్ధిక లావాదేవీల గురించి గొడవలు మొదలయ్యాయి. దీంతో ఆమె.. అబ్దుల్ హనాన్ అనే వేరే వ్యక్తి సహాయంతో మరో క్లినిక్ పెట్టుకుంది. కానీ తలాల్ ఆమెను వద్దలేదు. నిమిష ప్రియ సంపాదనలో నుంచి తనకు వాటా ఇవ్వాల్సిందేనని వేధించేవాడు. అందుకు ఆమె అంగీకరించపోవడంతో అతను బలవంతంగా ఆమె క్లినిక్ నుంచి డబ్బులు తీసుకునేవాడు.
నిమిష అతనిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు తలాల్‌ను అరెస్టు చేసినా.. అతడు కొన్ని రోజుల్లోనే జైలు నుంచి బయటికొచ్చాడు. నిమిషను అతను పెళ్లి చేసుకన్నట్లు ఆధారాలు చూపి.. ఆమె సంపాదనలో తనకు వాటా రావాల్సిందేనని అధికారులతో అతను చెప్పాడు. ఆ ఆధారాలు నకిలి అని నిమిష చెప్పినా.. అక్కడి పోలీసులు నిమిషకు ఏ సహాయం చేయలమని చెప్పి వెళ్లిపోయారు. ఆ తరువాత తలాల్ బలవంతంగా నిమిష పాస్ పోర్టు తీసుకున్నాడు.
అప్పటి నుంచి నిమిష తన సంపాదనలో నుంచి తలాల్‌కు కొంత భాగం ఇచ్చేది. 2017లో ఒక రోజు తలాల్‌కు నిమిష మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. ఆమె పాస్ పోర్టు తీసుకునేందుకు ప్రయత్నించింది.. కానీ ఆ మత్తు మందు కాస్త ఓవర్‌డోస్(ఎక్కువ) అయి తలాల్ మరణించాడు. ఇది చూసిన నిమిష భయపడి.. తన స్నేహితుడు హనాన్ అనే వ్యక్తి వద్దకు వెళ్లి సమస్య గురించి వివరించింది.
ఆ తరువాత నిమిష, హనాన్ కలిసి తలాల్ మృతదేహాన్ని ముక్కలుగా నరికి ఒక వాటర్ ట్యాంకులో పడేశారు. కానీ పోలీసుల విచారణలో ఇద్దరూ పట్టుబడ్డారు. అలా యెమెన్ ట్రయల్ కోర్టు ఆమెకు 2018 సంవ్సతరలో మరణశిక్ష విధించింది. అరబ్బు ముస్లిం దేశాలలో ఇలాంటి కేసులలో బయటపడాలంటే ఒకటే మార్గం.. మృతుడి కుటుంబం హంతకులను క్షమించాలి.. లేదా వారు కోరినట్టు కోర్టు శిక్ష విధిస్తుంది.
ఇప్పుడు తలాల్ కుటుంబం.. నిమిషను రూ.70 లక్షలు ఇవ్వాలని అడిగింది. ఆ డబ్బు ఇస్తే.. తలాల్ హత్య కేసులో ఆమెకు క్షమించి వదిలేయమని కోర్టులో తలాల్ కుటుంబ సభ్యులు చెబుతారు. కానీ అంత డబ్బు తన వద్ద లేదని నిమిష చెబుతోంది. అందుకే సుప్రీం కోర్టులో తన కేసుకు సంబంధించి అప్పీలు చేసింది. కానీ సుప్రీంకోర్టు ఆమె అపీలును తిరస్కరించింది. దీంతో కేరళలో ఉన్న నిమిష తల్లి డబ్బు ఏర్పాటు చేసుకొని యొమెన్ దేశానికి వెళ్లి తన కూతురిని తీసుకొస్తానని భారతదేశ ప్రభుత్వానికి చెప్పింది.
కానీ యెమెన్‌లో చాలా సంవత్సరాల నుంచి సివిల్ వార్(అంతర్యుద్ధం) జరుగుతోంది. అందువలన ఆ దేశానికి రాకపోకలను భారతదేశం నిషేధించింది. ఇప్పుడు తనను యెమెన్ వెళ్లేందుకు ప్రత్యేక అనుమతి ఇవ్వాలని నిమిష తల్లి భారత ప్రభుత్వానికి కోరింది. ఈ కేసులో భారత విదేశాంగ ప్రతినిధి మాట్లాడుతూ.. తాము యెమెన్ దేశ కోర్టుతో సంప్రదిస్తామని.. నిమిషను తిరిగి దేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్యాలు చేస్తామని చెప్పారు.