సిద్దిపేట జిల్లా తీగుల్‌లో దారుణం జరిగింది. విషప్రయోగంతో యువకుడిని హత్య చేశారు. హత్యకు వివాహేతర సంబంధమే కారణంగా తెలుస్తోంది. ఇంట్లో భార్యతో ఉపేందర్ కలిసి ఉండగా ఆమె భర్త నాగరాజు చూశాడు. ఒకసారి మాట్లాడాలని ఇంటికి పిలిపించి ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఉపేందర్ కు పురుగుల మందు కలిపిన కూల్ డ్రింక్ ఇవ్వగా.. అతడికి అనుమానం కలిగింది. ఎప్పుడూలేనిది నాగరాజు ఇంటికి పిలిచి మరీ మర్యాదలు చేస్తుండటంతో.. కూల్ డ్రింక్ వద్దని తిరస్కరించాడు.
అయినా వదలని నాగరాజు.. పురుగుల మందు కలిపి ఉపేందర్ తో బలవంతంగా తాగిచ్చాడు. దీంతో తీవ్ర స్వస్థతకు గురైన ఉపేందర్ ను గాంధీ హాస్పిటల్ కు తరలించారు. ఆ తర్వాత పోలీసుల స్టేట్‌మెంట్‌లో విషం కలిపిన కూల్ డ్రింక్ తాగించారని వెల్లడించాడు. గాంధీలో చికిత్స పొందుతూనే ఉపేందర్ మృతిచెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఒక్కవివాహేతర సంబంధం ముగ్గురి జీవితాలను నాశనం చేసింది. పరాయి మగాడి భార్యతో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఉపేందర్ హత్యకు గురయ్యాడు. ఉపేందర్ ను హత్యచేసిన నాగరాజు జైలుకెళ్తాడు. అటు ప్రియుడు లేక, ఇటు భర్త లేక.. ఆ వివాహిత ఇప్పుడు ఏకాకిగా మిగిలింది.