
December 31:2022, డిసెంబర్ 31 ఈ ఏడాది శనివారం నాడుతో ముగుస్తోంది. అలాంటి నువ్వులు ఉండలు చేసి పంచితే మంచి జరుగుతుంది. పేదవాళ్లకి కానీ పిలలకు కానీ మీ చేతుల మీదగా ఇవ్వండి. అలా చేస్తే వచ్చే ఏడాది అంతా మీకు కలిసి వస్తుంది. ఆ పంచే టప్పుడు కూడా సమయపాలన పాటించాలి. ఉదయం 6 గంటల నుంచి ఏడు గంటల లోపు , మళ్లీ మధ్యాహ్నం ఒంటి గంట నుంచి 2 గంటల మధ్యలో కానీ, లేదా రాత్రి ఎనిమిది గంటల నుంచి తొమ్మిది గంటల మధ్యలో మీ చేతుల మీదుగా పంచండి. నువ్వు ఉండలు లేకపోతే నువ్వు జీడీల అయినా పంచి పెడితే ఫలితం ఉంటుంది.
కలియుగదైవం వెంకటేశ్వరస్వామి ఆలయానికి డిసెంబర్ 31న వెళ్లి దర్శనం చేసుకోండి. ఆ వేళ తులసీ దళాలతో వెంకటేశ్వరస్వామికి సమర్పించి ఆలయంలో దీపం వెలిగించండి. ఎనిమిది ప్రదక్షణలు చేయడం ద్వారా వచ్చే ఏడాది అంతా మీకు శుభమే కలుగుతుంది. అలా ఆలయానికి వెళ్లి పూజలు చేయలేని వాళ్లు డిసెంబర్ 31న ఉదయం ఇంట్లోనే బియ్యం పిండి, తురిమిన బెల్లంతో చలిమెడ ప్రమీద తయారు చేసి అందులో ఆవు నెయ్యి వేసి వెలిగించి వెంకటేశ్వర స్వామి చిత్రపటం ముందు ఉంచాలి. అలా చేస్తే ఏడాది మొత్తం వెంకటేశ్వరస్వామి అనుగ్రహం కలిగి అంతా మంచే జరుగుతుంది.
ఆ వేళ ఆంజనేయస్వామికి ఆకు పూజ చేయించుకుంటే మంచిది .అలా చేయలేని వాళ్లు గంధ సింధూరంతో బొట్లు ఆంజనేయ స్వామి చిత్రపటానికి పెట్టండి. శివుడ్ని ఆరాధించే వారు నల్ల నువ్వులతో శివలింగానికి అభిషేకం చేయాలి. లేదంటే నల్ల నువ్వులు కలిపిన పాలతో శివుడికి అభిషేకం చేయాలి. శివలింగం ఇంట్లో లేని వాళ్లు చిత్రపటానికి నువ్వలతో పూజ చేస్తూ శివాయ నమః అంటూ 21 సార్లు మంత్రం జపించాలి. ఆ తర్వాత ఆ నువ్వులను గోవులకు తినిపించాలి. డిసెంబర్ 31న శివుడ్ని, ఆంజనేయుడ్ని, వెంకటేశ్వరస్వామిని పూజిస్తే ఏడాది అంతా శుభ ఫలితాలు కలుగుతాయి.
డిసెంబర్ 31 అర్ధరాత్రి దేవుడి దగ్గర అదృష్ట దీపాన్ని వెలిగించాలి. పూజ గదిని శుభ్రం చేసి వెండి ప్రమిదలో ఆవు నెయ్యి కానీ నువ్వులనూనె కానీ పోసి తెల్ల జిల్లేడు ఒత్తులు వేసి వెలిగించాలి. 8 తెల్లజిల్లేడు ఒత్తులు వేసి వెలిగించడం వల్ల విశేషంగా అదృష్టాన్ని తీసుకువస్తుంది.
Ambati Rambabu : ఆ విషయం మీ మాజీకే చెప్పండి..! రేణు దేశాయ్ కు అంబటి కౌంటర్..