
Dakshina : సాధారణంగా మనం గుడికి వెళ్లినప్పుడు పూజారికి దక్షిణ ఇస్తూ ఉంటాం. అయితే పూజారికి తప్పనిసరిగా దక్షిణ ఇవ్వాలని నియమం ఏదీ లేదు. కానీ నిత్యం భగవంతుని సేవలో ఉండే పూజారికి మనం తోచిన విధంగా దానం చేయడంలో తప్పేముంది. అన్నిటికీ డబ్బులు అవసరం .అందరికి డబ్బు కావాల్సిందే.ఇది లోక నియమం.
పూర్వకాలం రాజులు-జమీందారులు, ధనికులు, పాపనివృత్తి కోసం హిందూ ధర్మరక్షణ కోసం, కీర్తికోసం, ప్రజల పరధర్మాపాలై పోతేరేమోనన్న ఆలోచనతో దేవాలయాలు నిర్మించారు. ఎనలేని ఖ్యాతిని మహిమను ప్రచారం చేయించి హిందూ ధర్మ రక్షణకు సహాయపడ్డారు.
దేవాలయాలు నిర్మించటం కన్నా వారిని నిర్వహించడం చాలా కష్టం. కొన్ని రోజులు కష్టపడితే దేవాలయ నిర్మాణం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆలయ నిర్వహణ కూడా అంతే ముఖ్యం. ప్రతినిత్యం నైవేద్యం, సమర్పించటం, దీపారాధాన చేయడం, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందించటం, పరిశుభ్రతను కాపాడటం ఇవన్నీ చిన్న విషయాలు కాదు.
రాజులకాలంలో ఆలయ నిర్వహణకు భూములను మాన్యాలుగా ఇచ్చేవారు. ఇచ్చిన భూములు అకాల వర్షాల వల్ల, అతి వర్షాల వల్ల, క్రిమికీటకాల వల్ల ఇలా ఎన్నో కారణాలు వల్ల సక్రమంగా ఆదాయం అందేదికాదు. దేవాలయాలను నమ్ముకుని సేవలు చేసే వారికి సంతృప్త భోజనం లభించేంది కాదు. అలాంటి సమస్యాత్మక స్థితిలో పూజారికి కానుకలు సమర్పించే పద్ధతిని ప్రారంభించారు.
మన కోసం పనిచేసిన పెట్టిన వారు కష్టాల్లో ఉంటే ఎవరైనా సరే వారి కష్టానికి తగ్గ ప్రతిఫలం ఇవ్వడం ధర్మం. ఒక వేళ అలా ఇవ్వకపోతే అధర్మం. ఇది వాల్మికి రామాయణంలో భరతుడు చెప్పింద అందుకే గుడికి వెళ్లినప్పుడు మీకు తోచినంత దక్షిణ ఇవ్వడంలో తప్పులేదు. మన సమాజంలో అన్ని వృత్తులూ గౌరవనీయమైనవనే సంగతి గుర్తుపెట్టుకోవాలి.