
Kartika Masam : కార్తీకమాసమంతా ప్రవిత్రమంది. ఈ మాసమంతా తలస్నానం చేయడం మంచిది. తెల్లవారుజామున నదులు చెరువులు, దిగుడు బావుల్లో మాత్రమే తలారా స్నానాలు మంచివి. ఇది వీలుకాకపోతే ఇంట్లోనైనా శాస్త్ర ప్రకారం స్నానం ఆచరిస్తే మంచి ఫలితాలు లభిస్తాయి.కొంతమంది ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అలాంటి వారు కూడా ఈపని చేస్తే సరిపోతుంది. శరత్కాలంలో నీళ్లల్లో ఔషధాలు ఉంటాయి. వర్ష రుతు ప్రభావం కనుమరుగై శీతాకాలానికి మధ్య సంధికాలంగా ఉండే సమయం ఇది. ఈ కాలంలో మారిన, మారుతున్న వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా శరీరాన్ని మలచడం కోసం పూర్వీకులు ఏర్పాటుచేసిన ఆచారం కార్తీక స్నానం.
అదేంటంటే రోజు వారీ కాకపోయినా పర్వదినాల్లో మాత్రం తలారా స్నానం ఆచరించండి…. నాలుగు సోమవారాలు,రెండు ఏకాదశులు, పౌర్ణమి రోజున తలారా స్నానం చేయండి. కార్తీక మాసం వ్రతం ఆచరించే వాళ్ళు నెలంతా కిందే పడుకోవాల్సి ఉంటుంది.తలకి నూనె రాసుకోండి..ప్రతిరోజు తలస్నానం చేయాలి. తెల్లవారుజామున చేసి పూజ చేసి పురాణ పఠనం లేదా శ్రవణం చేయాలి.
కార్తీక వ్రతానికి సంబంధించిన ఇంకా చాలా నియమాలు ఉన్నా అందులో మనం చేసేవి మాత్రం శ్రద్ధాసక్తులతో ఆచరించాలి. ఏది మనం చేయగలమా అదే చేస్తే సరిపోతుంది. ఇందులో ఆరోగ్య సమస్యలున్నవారు నిత్యం తలస్నానం ఆచరించాల్సిన పనిలేదు . అభ్యంగ స్నానం ఆచరించాల్సిన పనిలేదు. పుణ్యస్త్రీలు ఒంటికి చిటికెడు పసుపు రాసుకుని స్నానం చేస్తే తలస్నానం ఆచరించినట్లు అవుతుంది…అలా చేయడం వల్ల మడికి ఎలాంటి తప్పు ఉండదు.
ఏదైనా సరే మనం నియమం పెట్టుకుంటే అదే చేయాలి. నిత్యదీపారాధన చేయాలని అనుకుంటే ఆగకుండా చేయాలి. ఇంట్లో ఎవరికైనా సూతకం ఉంటే నిత్యం దీపం పెట్టుకోవచ్చు…కానీ కార్తీక దీపాలు పెట్టకూడదు. తులసి కోట దగ్గర కానీ, దేవాలయంలో కాని పెట్టుకోవచ్చు. దీపాలు ఇంట్లో పెట్టుకునే పరిస్థితి లేకపోతే నిత్యం దేవాలయానికి వెళ్లి నిరభ్యంతరంగా వెలిగించవచ్చు. శివాలయంలో కానీ విష్ణు ఆలయంలో కానీ చేయచ్చు. ఇందులో ఎలాంటి తప్పు లేదు.