
Date of Birth: పుట్టిన తేదీని బట్టి ఆ వ్యక్తి ఎలాంటి వారు తెలుసుకునే పద్దతులు ఉన్నాయి. పుట్టిన తేదీ ద్వారా వ్యక్తిత్వాన్నే కాదు ఇష్టాష్టలను అంచనావేసి, భవిష్యత్తును కూడా తెలుసుకోవచ్చు. పుట్టిన తేదీని బట్టి కొన్ని వస్తువులను మాత్రమం గృహంలో ఉంచితే మంచి జరుగుతుందని పురాతన గ్రంధాలు చెబుతున్నాయి. అలా చేస్తే జీవితం ఎదురయ్యే ఎలాంటి ఆటంకాలనైనా అధిగమించి ముందుకు సాగుతారట. ఏదైనా నెలలో ఒకటో తేదీని జన్మించిన వ్యక్తులు వెదురుతో తయారు చేసిన వేణువు ను ఇంట్లోని ఉత్తర దిక్కున ఉంచాలి . పుట్టిన తేది 2 అయితే తెలుపు రంగు గవ్వలతో తయారు చేసిన బొమ్మలను ఇంట్లోని వాయువ్య దిశలో ఉంచాలి . ఇవి ఎప్పుడు సానుకూల వాతావరణాన్ని సృష్టిస్తాయి . నెలలో మూడో తేదిన పుట్టిన వ్యక్తులు రుద్రాక్షను ఇంట్లోని ఈశాన్య దిక్కులో ఉంచాలి .
పుట్టిన తేది నాలుగు అయితే అద్దాలను దీర్ఘచతురస్రాకారంలో చిన్న ముక్కలుగా కోసి నైరుతి దిశలో ఉంచుకోవాలి.
పుట్టిన తేదీ ఐదు అయితే జన్మించిన వ్యక్తులు కుబేరుడు లేదా లక్ష్మీదేవి విగ్రహాలను ఇంట్లోని ఉత్తర దిక్కులో ఉంచాలి. దీని వల్ల అపార సంపదలు, శ్రేయస్సు లభిస్తుంది . ఏదైనా నెలలో ఆరో తేదిన పుట్టిన వాళ్లు నెమలి పింఛాన్ని ఇంట్లో ఆగ్నేయ దిశలో ఉంచితే సంపద వృద్ధి కలుగుతుంది. ఏడో తేదిన పుట్టిన వ్యక్తులు ఆగ్నేయ దిశగా రుద్రాక్షను ఉంచాలి . అయితే ముదురు రంగులో ఉండే రుద్రాక్షణను ఉండాలి. పుట్టిన ఎనిమిదైతే ఇంటిలోని దక్షిణ దిశలో బ్లాక్ క్రిస్టల్ పెట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీని స్వీకరించి అనుకూల వాతావరణాన్ని సృష్టిస్తుంది. తొమ్మిది పుట్టిన సంఖ్య అయితే పిరమిడ్ ను ఇంట్లోని దక్షిణంగా ఉంచితే దుశ్శకునాలు తొలగిపోయి మేలు జరుగుతుంది. రెండంకెలలో పుట్టిన వాళ్లు ఉంటే ఆ సంఖ్యను కలుపుకోగా వచ్చేది వారికి వర్తిస్తుంది. మీరు 19వ జన్మిస్తే మీ జనన సంఖ్య 1 అవుతుంది . 26 అయితే 8 అవుతుంది .
Pawan Kalyan: టీడీపీ, బీజేపీ మధ్య ఇష్యూ.. పవన్ సంచలన కామెంట్స్..