
Akshaya Tritiya: వైశాఖ శుధ్ద తదియనే అక్షయ తృతీయగా జరుపుకుంటారు. ఈ రోజునే సింహాచల వరాహ నరసింహ స్వామి వారి చందనోత్సవం కూడా జరుగుతుంది. స్వామి వారు భక్తులకు నిజరూప దర్శనం ఇస్తారు. అక్షయ తృతీయ ప్రత్యేకతలు చాలా ఉన్నాయి. అందులో ఓ 10 విశేషాల గురించి తెలుసుకుందాం.
–త్రేతాయుగం మొదలైన రోజు.
–పవిత్ర గంగా నది భూమిని తాకిన పర్వదినం.
–శివుని ప్రార్థించి కుబేరుడు శ్రీమహాలక్ష్మితో సమస్త సంపదలకు సంరక్షకునిగా నియమింపబడిన శుభపర్వం.
–అన్నపూర్ణా దేవి తన అవతారాన్ని స్వీకరించిన సందర్భం.
–రాజ శ్యామలా దేవి జన్మించిన శుభదినం.
–పరశురాముడు పుట్టిన రోజు.
–వ్యాస మహర్షి మహా భారతమును వినాయకుని సహాయముతో వ్రాయడం ఆరంభించిన రోజు.
–సూర్య భగవానుడు అజ్ఞాతవాసములో ఉన్న పాండవులకు ‘అక్షయ పాత్ర’ ఇచ్చిన సందర్భం.
–శ్రీకృష్ణుడు తన బాల్యమిత్రుడైన కుచేలుడిని కలుసుకొన్న దినం.
–ఆదిశంకరులు “కనకధారాస్తోత్రం” చెప్పిన రోజు.