
Non Veg Prasadam:గుడిని బట్టి గుడిలో ప్రతిష్టించబడిన దేవుడ్ని బట్టి కొన్ని ఆచారాలు, పద్దతులు మారుతుంటాయి. పైగా ప్రాంతానికి రాష్ట్రానికి వెళ్తే మార్పులు మరిన్ని కనిపిస్తాయి. ప్రాంతానికి తగ్గట్టు సంప్రదాయాలు, పద్దతులు మారుతుంటాయి. కొన్ని దేవాలయాలలో మాంసాహార ప్రసాదాలు అందుబాటులో ఉన్నాయి.సాధారణంగా ప్రజలు ఆలయాలను ఎంతో పవిత్ర స్థలంగా భావిస్తారు, అందుకే మాంసాహారం, ఉల్లి, వెల్లుల్లిని తిన్న తర్వాత అక్కడికి రావడం నిషేధించబడింది. ఈపద్దతి మళ్లీ దేశవ్యాప్తంగా లేదు.
దేశంలో వివిధ ప్రాంతాల్లో ఇటువంటి అనేక దేవాలయాలన్నా కొన్ని చోట్లే మాంసాహార ఆహారాన్ని భగవంతునికి సమర్పించి, దానిని ప్రసాదంగా పంపిణీ చేస్తారు. కొన్ని దేవాలయాలలో, ప్రజలు బలి సంప్రదాయాన్ని అనుసరిస్తారు. వారి దేవతను ప్రసన్నం చేసుకోవడానికి మాంసాహారాన్ని ప్రసాదంగా అందిస్తారు. ఒడిశాలోని పూరీ జగన్నాథ ఆలయ సముదాయంలోని పవిత్ర చెరువు రోహిణి కుండ్ పక్కన, పూరీలో ఉన్న ప్రసిద్ధ దేవాలయం విమల ఆలయం . ఈ గుడిలో విమల జగన్నాథుని తాంత్రిక భార్య , ఆలయ సంరక్షకురాలిగా భావిస్తుంటారు. ఈ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక రోజుల్లో మాంసం, చేపలు సమర్పించే సంప్రదాయంగా కొనసాగుతోంది.
తమిళనాడులోని మధురైలోని వడక్కంపట్టి అనే చిన్న గ్రామంలో మునియడి అంటే మునీశ్వరుడికి అంకితం చేయబడింది. ఆయనను శివుని అవతారంగా భావిస్తారు. ఈ ఆలయంలో నిర్వహించే మూడు రోజుల వార్షిక పండుగలో చికెన్, మటన్ బిర్యానీ ప్రసాదంగా వడ్డిస్తారు. అంతేకాదు, ప్రజలు అల్పాహారం కోసం ఈ బిర్యానీ తినడానికి ఆలయానికి వస్తారు. ఉత్తరప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్‌లోని తారకుల్‌హా దేవి ఆలయంలో ప్రతీ సంవత్సరం ఖిచిడీ మేళా నిర్వహిస్తారు. మాంసాహారం తిన్న వాళ్లు నిరంభ్యంతరంగా దేవుడి ప్రసాదాన్ని ఆరగించవచ్చు.