
Pooja Room : ఇంట్లో సానుకూల శక్తిని పెంచడానికి, ప్రతికూల శక్తిని తొలగించడానికి పూజగది.. పూజా కార్యక్రమాలు ఉపకరిస్తాయని పెద్దలు చెబుతారు. పూజ గది విషయంలో నిర్మాణానికి కొన్ని సూత్రాలను రూపొందించారు పెద్దలు. వాటిని అనుసరించడం వల్ల ఆ ఇట్లో సానుకూల శక్తి పెరిగి అందులో నివసించేవారికి మంచి ఆరోగ్యం, ఆయుష్షు పెరుగుతాయని, మానసిక ప్రశాంతత చేకూరుతుంది.దాదాపుగా ప్రతి కుటుంబానికీ మూల దైవం ఒకరు ఉంటారు. వారికి సంబంధించిన విగ్రహాలనో, చిత్ర పటాలనో పెట్టి ప్రార్థన చేసుకునేందుకు ప్రత్యేకంగా ఒక గదిని ఏర్పాటు చేసుకునే వారు గతంలో. ప్రస్తుతం నగరాలలోని ఇరుకు జీవనాల్లో దేవుడికి ప్రత్యేకంగా ఒక గదిని కేటాయించడం పెద్ద సమస్యే.
అయినప్పటికీ వీలుంటే చిన్నదైనా పూజగదిని ఏర్పాటు చేసుకోండి. వాస్తు ప్రకారం పూజ గదిని ఎక్కడ ఏర్పాటు చేయాలి? ఎలా చేయాలి? అనే అంశాలను పరిశీలిద్దాం..పూజ గదిని సాధ్యమైనంత వరకూ ఈశాన్యం లేదా తూర్పు లేదా ఉత్తరం దిక్కున ఏర్పాటు చేసుకోవడం మంచిదని వాస్త్రు శాస్త్రం చెబుతోంది .ఉదయాన్నే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు కనుక.. ఇంటికి ఈశాన్య దిక్కున సూర్యకిరణాలు ప్రసరిస్తాయి కనుక ఈ సమయంలో యోగ, ధాన్యం, పూజ ఎంతో ప్రశాంతంగా సాగుతాయనేదన్న ఆలోచనతో ఈ ఏర్పాటు ఉండాలంటారు. సూర్యుడి లేత కిరణాలు ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి.
ఒకవేళ పూజ గది ఏర్పాటు చేసుకోవడానికి స్థలం లేకపోతే వంటింట్లోనే ఈశాన్య దిక్కున పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు. ఇప్పుడు చాలామంది ఇదే చేస్తున్నారు. అపార్ట్‌మెంట్లలో ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకోవడం కుదరదు కనుక ఇది ఉత్తమ పద్ధతి.
పూజా మందిరాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ పడకగదులలో ఏర్పాటు చేసుకోకూడదు. అలాగే బాత్‌రూంకు సమీపంలోనూ ఏర్పాటుచేసుకోకూడదు. కొంతమంది స్థలం సర్దుబాటు కోసం టాయిలెట్ పక్కన పూజ గదిని ఏర్పాటు చేసుకుంటారు. అది చాలాతప్పు.. బహుళ అంతస్తుల భవంతిలో ఫ్లాట్లు కొనేటప్పుడు పై పోర్షన్‌లో ఉండే బాత్‌రూమ్‌లు, టాయిలెట్‌లకు దిగువన మన పూజగది రాకుండా చూసుకోవాలి.
పూజగదిలో దేవుడికి దీపాలు వెలిగించడం, రకరకాల సువాసనలు వెదజల్లే పరిమళభరితమైన పువ్వులను అర్పించడం, కర్పూరం, అగరవత్తులు వెలిగించి, మంత్రోచ్ఛారణ చేయడం వల్ల పూజ గది నుంచి సానుకూల శక్తి వెలువడుతుంటుంది. పూజగదిలో పవిత్ర జలాలు, సుగంధ ద్రవ్యాలు, పంచామృతాలతో అభిషేకం చేయడం వలన అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఏర్పడుతుంది. ఇది ఇల్లంతటికీ వ్యాపిస్తుంది.విగ్రహాలను ఈశాన్యం, తూర్పు లేదా పడమర దిక్కున పెట్టుకోవచ్చు. విగ్రహాలను ఉత్తర దిక్కు పెట్టకూడదు. ఆ దిక్కున పెడితే ప్రార్థించేవారు దక్షిణ ముఖంగా కూర్చోవలసి వస్తుంది. అలా కూర్చున్నప్పుడు వారి పాదాలు దక్షిణ దిక్కుకు, తల ఉత్తరం దిక్కుకు ఉంటాయి. దీనివల్ల శరీరంలోని ఉత్తర మూలమైన తల భూమి నుంచి వచ్చే అయస్కాంత ఉత్తర ధృవాన్ని వికర్షిస్తాయి. అలాగే విగ్రహాలు ఒకదానికి ఎదురుగా ఒకటి పెట్టకూడదు.
Sajjala comments on CBN: చంద్రబాబు చట్టానికి అతీతుడా? టీడీపీ నేతలకు సజ్జల కౌంటర్..