
Tuesday:మంగళవారం నాడు ఏ దేవుడ్ని ఆరాధిస్తే శ్రేయస్సు కలుగుతుంది….ఆంజనేయస్వామిని తప్ప ఇతర దేవతలను పూజించకూడదా….ఇలాంటి సందేహాలు ఎన్నో ఉంటాయి. ఏవైనా రోగాలతో బాధపడేవారు కొత్త జౌషధాలు తీసుకోవడానికి మంగళవారాన్ని ఎంచుకుంటారు. మందులు తీసుకునేందుకు వైద్యుడి సలహా కోసం తొలిసారి మంగళవారం కలిస్తే ఆ రోగం త్వరగా నయమైపోతుందని నమ్మకం. ఇలాంటి పనికి మంగళవారామే సరిదైనది. అలా చేస్తే ఔషధాలు వేసుకునే పరిస్థితి క్రమంగా తగ్గిపోతుంది. చాలా చోట్ల మంగళవారం శుభాకార్యాలు నిర్వహించరు. ముఖ్యంగా పెళ్లిళ్లిలాంటివి తలపెట్టరు. గృహప్రవేశాలు లాంటివి కూడా ఏర్పాటు చేయరు.
సంస్కృతంలో మంగళవారానికి జయవారమని పేరు. అంటే మంగళ ప్రదమమైనదని అర్ధం. శోభాయమైనది, శుభకరమైనదని అని మంగళ అనే శబ్ధానికి అర్థం. జయవారంలో జయం అంటే ఎవరో ఒకరిది ఓటమి కూడా ఉంటుందన్న సంగతి గుర్తు పెట్టుకోవాలి. ఒకరు ఓడిపోతేనే మరొకరికి విజయం కలుగుతుంది. వ్యాధి ఓడిపోతేనే రోగికి విజయం సిద్ధిస్తుంది. క్షేమం కలుగుతుంది. ఆరోగ్యం చేకూరుతుంది. మంగళవారం వ్యాధి ఓడిపోవాలి. వివాహాలు, గృహ ఆరంభాలు, ఇతర శుభకార్యాలయాల్లో ఎవరికి ఓటమి ఉండదు. పెళ్లి అంటే ఇరుపక్షాలకు విజయం కలిగించే సందర్భం. గృహప్రవేశంలోను ఎవరికి ఓటమి ఉండదు.
కొత్తగా మంత్రం స్వీకరించాలని అనుకునేవారు , నాలో ఉండే అహంకారం, నేను అనే భావన తొలగించాలి అనుకుంటే మంగళవారం నాడు మంత్ర జప సాధన చేయాలి. ఇలాంటి బోధనలు చేసే నిమిత్తమే మంగళవారం ఆంజనేయ స్వామిని అర్చించాలని సంప్రదాయం అంటోంది. ఆంజనేయస్వామి పరివార దైవము. శ్రీరామ చంద్రమూర్తి వారి వెంట ఉండే కుటుంబ సభ్యులు , ఆత్మీయులు, స్నేహితులు, సలహా దారులు, భరతుడు, శతృఘ్నుడు, లక్ష్మణుడు, జాంబవంతుడు, సుగ్రీవుడు, నీరుడు, గవయుడు ఇంకా అలాంటి వారు ఉండగా….పుషుడు, వల్లభుడు, దశరథుడు ఉండగా ఇంతమంది ఉన్నా..రాముడితో సమానంగా దేవుడిగా పూజలు అందుకునే పరమ దైవం ఆంజనేయుడు మాత్రమే.
నేను అనే భావనను సంపూర్ణంగా తొలగించుకుని రాముడే పరమదైవం అని నమ్మిన దైవం ఆంజనేయుడు కనుక మంగళవారం ఆంజ నేయుడ్ని పూజించాలి. అహంకారంపై జయం పొందాలి అనుకునేవారు మంగళవారం నాడు తమలపాకులతో అర్చించాలి. వడమాలతో నైవేద్యం సమర్పించి తర్వాత ఆ వడమాలను అందరికి పంచి పెట్టాలి. అందరితో ఆనందాన్ని పంచుకోవాలి.
Bandi Sanjay Visits Aravind House : ఎంపీ అరవింద్ తల్లిని పరామర్శించిన బండి సంజయ్..