
Silver Gift Items:ఏదైనా శుభకార్యం జరిగినా, పెళ్లి జరిగినా , గృహ ప్రవేశాలు లాంటివి జరిగినా పెద్ద ఫంక్షన్లకు వెండి వస్తువులు బహుమతగా ఇస్తుంటాం. తీసుకుంటూ కూడా ఉంటాం. ఆప్తులకు, బంధువులకు వెండి వస్తువులు ఇవ్వచ్చా అన్న సందేహాలున్నాయి. కొంతమంది ఇవ్వొచ్చని అంటే మరికొందరు అలా ఇవ్వకూడదు అని అంటారు. మన ఇంటి ఆడపిల్లను అత్తగారింటికి పంపించేటప్పుడు కానుకగా వెండి వస్తువులు కూడా ఇచ్చి పంపుతూ ఉంటాం. అలా పంపడం వల్ల అమ్మాయికి గౌరవం లభిస్తుంది.అంటే అంత ఉన్నతమైన కుటుంబం నుంచి వచ్చిందని అత్తవారు అనుకుంటారు. అలాగే మన ఇంటికి వచ్చేవారికి స్తోమతను బట్టి రవిక , బట్టలు కానీ ఇంకా ఉన్న వాళ్లు వెండి వస్తువులు బహుమతగా ఇచ్చి పంపుతారు.
ఈ వెండి వస్తువులు మనం వారికి ఇవ్వడం వల్ల భగవంతుడికి పూజ చేసే సమయంలో ఉపయోగపడుతుంది. కాబట్టి వెండి వస్తువులు బహుమతిగా ఇవ్వచ్చు అని కొందరు రీజన్ చెబుతుంటారు. బట్టలు లాంటి ఇస్తు వారు కొంతకాలం వాడి పక్కన పెట్టొచ్చు. అదే వస్తువులు అయితే వాటిని చూసినప్పుడు మనమే గుర్తుకు వస్తాం. బహుమతి రూపంలో ఇచ్చే వాటికి దోషం అనేది వర్తించదట. మనం ఇచ్చే వెండి వస్తువు వాళ్లకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఇక్కడ ప్రధానమైన విషయం.
కొంతమంది వెండి విగ్రహాలు బహుమతిగా ఇస్తుంటారు. అప్పటికే ఇంట్లో వెండి విగ్రహాలు ఉండి ఉండవచ్చు . అలాంటి సమయంలో మనం ఇచ్చే వస్తువులు వల్ల వాళ్లకి ప్రయోజనం లేదు. ఎక్స్ ట్రా వస్తువులు బీరువాల్లో మరో చోట దాచిపెట్టుకోవడానికి పరిమితం అవుతాయి. కాబట్టి అలాకాకుండా భగవంతుడి పూజకి అక్కరకు వచ్చే వారికి మాత్రమే వెండి వస్తువులు ఇవ్వడం వల్ల ఉపయోగం ఉంటుంది. దీపపు కుందులు, హారతి ఇచ్చే పాత్రలు, ప్రసాదాలు పెట్టే పళ్లాలు, ఇవ్వచ్చు. బ్రాహ్మణులకు గోవు విగ్రహాన్ని దానంగా ఇస్తే మరీ మంచిది