
Womens Money:ఆడపడుచుల సొమ్ము ఏరూపంలోను పుట్టింటి వాళ్లు స్వీకరించకూడదని శాస్త్రాలు చెబుతున్నాయి. స్త్రీ ధనం 9 రకాలు. వివాహ సమయంలో పసుపు కుంకుమల కింద తల్లిదండ్రులు ఇచ్చే మడి, మాగాణి, బంగారం లాంటివి కూడా స్త్రీ ధనమే . స్త్రీకి ధనం తొమ్మిదిరకాలుగా చేకూరుతుంది.. పుట్టిన సమయంలో మేనమామ ఇచ్చే బాలతొడుగు, అన్నప్రాసన, అక్షరాభ్యాసంలాంటి కార్యక్రమాల్లో అమ్మాయిని దీవించి కానుకగా ఇచ్చే డబ్బులు, నగలు అవి కూడా స్త్రీ ధనమే. వివాహ సమయంలో అమ్మాయికి ఇచ్చేవి స్త్రీ ధనమే. పెళ్లిళ్లో ఇచ్చే కట్నకానుకలు కూడా అమ్మాయికే చెందాలి. భర్త కూడా తాంబూలాలు ఇచ్చే సమయంలో బంగారాన్ని, డబ్బును ఆమె కొంగుకు ముడివేస్తాడు . అది కూడా స్త్రీ ధనం కిందే లెక్క.
అలాగే కొడుకు సంపాదించే ఇచ్చే మొదటి సంపాదన తల్లికే అందచేస్తాడు అది కూడా స్త్రీ ధనమే. ఈవిధంగా 9రకాలుగా స్త్రీ ధనాన్ని స్మృతుల్లో చెప్పారు. అందుకే ఎట్టిపరిస్థితుల్లోను స్త్రీ ధనాన్ని స్వీకరించకూడదని ధర్మశాస్త్రం చెబుతోంది . ప్రతీ ఒక్కరు వాళ్లకి వాళ్లు సంపాదించేది అనుభవించాలి. అది ఉత్తమం. తండ్రి సంపాదించిన ఆస్తి దక్కి దాన్ని అనుభవిస్తే అది మధ్యమం. అన్నదమ్ముల వాటాలు తీసుకుని అనుభవించడం అధమం. స్త్రీధనాన్ని తీసుకోవడ అధమంగానే భావించాలని శాస్త్రం చెబుతోంది. వారి ధనాన్ని ఆశించడమే తప్పు.
Elon musk: మస్క్‌కు చుక్కలు చూపించిన కొవిడ్ వ్యాక్సిన్.. చచ్చిపోయేంత టార్చర్