
Mythri Movie: మైత్రీ మూవీ మేకర్స్ కార్యాలయం, నిర్మాతల ఇళ్లలో ఐటీ అధికారులు రోజుల తరబడి తనిఖీలు చేశారు. ఓ ప్రొడ్యూసర్ ఇంట్లో ఏముంటుంది? అంతగా ఏం చేశారనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. ఇన్‌కమ్‌ట్యాక్స్ రైడ్‌లో పెద్ద డొంకే కదిలిందని తెలుస్తోంది. మైత్రీ మూవీ మేకర్స్‌కు ఏకంగా 700 కోట్లు విదేశాల నుంచి పెట్టుబడులుగా వచ్చినట్టు ఐటీ గుర్తించినట్టు సమాచారం. అదంతా బ్లాక్ మనీనే అనేది అనుమానం.
ఆ 700 కోట్లు ముందుగా ముంబైకి చెందిన ఓ కంపెనీకి బదిలీ అయ్యాయట. అక్కడి నుంచి ఆ సొమ్మును ఏడు కంపెనీలకు తరలించారట. వాటి నుంచి మైత్రీ మూవీ మేకర్స్‌లోకి వేరువేరుగా పెట్టుబడుల రూపంలో వైట్ మనీగా చూపించే ప్రయత్నం చేశారని ఐటీ తనిఖీల్లో తేలిందని అంటున్నారు.
ఇటీవల బాలీవుడ్ టాప్ డైరెక్టర్ సిద్ధార్థ్ ఆనంద్, ప్రభాస్‌ల కాంబినేషన్‌లో పాన్ ఇండియా సినిమా తీసేందుకు మైత్రీ మూవీస్ ఒప్పందం కుదుర్చుకుంది. ఆ దర్శకుడికి ఏకంగా 150 కోట్లు అడ్వాన్స్‌గా చెల్లించింది. ఆ సొమ్మంతా హవాలా రూపంలోనే ఇచ్చారని ఐటీ దర్యాప్తులో వెల్లడైనట్టు తెలుస్తోంది.
ఈ ఐటీ రైడ్స్ టాలీవుడ్ హీరోలను సైతం షేక్ చేస్తోంది. ఇటీవల మైత్రీ బ్యానర్‌లో నటించిన పలువురు హీరోలను సైతం రెమ్యునరేషన్ సొమ్మును హవాలా మార్గంలోనే ముట్టజెప్పినట్టు ఐటీ చెబుతోంది. లేటెస్ట్ సీక్వెల్ మూవీ హీరోతో పాటు.. గత రెండేళ్లలో ఇద్దరు టాప్ హీరోలకు సైతం అనుమానాస్పద రీతిలో చెల్లింపులు జరిపినట్లు ఐటీ అధికారులు గుర్తించారని తెలుస్తోంది. ఆ హీరోల ఆర్థిక లావాదేవీలనూ పరిశీలించేందుకు ఐటీ రెడీ అవుతున్నట్టు సమాచారం. అదే జరిగితే టాలీవుడ్‌లో సంచలనమే. బహుషా అందుకే కావొచ్చు.. ఐటీ రైడ్స్‌కు బేజారై.. మైత్రీ నిర్మాత హాస్పిటల్‌లో చేరాల్సి వచ్చిందంటున్నారు.
Komatireddy : ఓడినవారితో కూర్చోవాలా?.. ఆ నోటీసులు చెత్తబుట్టలో పడ్డాయి : కోమటిరెడ్డి