
Dussehra Celebrations : ప్రతి ఏటా దసరా పండగకు దేశ రాజధాని ఢిల్లీలోని లవ్ కుశ్ రామ్ లీలా మైదానంలో రావణ దహనం కార్యక్రమాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తారు. సాధారణంగా ఈ రావణ దహనాన్ని రాజకీయనాయకులు నిర్వహిస్తారు. అయితే మన చరిత్రలోనే తొలిసారి ఓ మహిళ అది కూడా బాలీవుడ్ సెలబ్రిటీ కంగనా రనౌత్ చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్నినిర్వహించారు.
కానీ కార్యక్రమంలో భాగంగా మణికర్ణిక రావణసురుడి దహనానికి ఎక్కుపెట్టిన బాణం గురితప్పింది. ఎన్నిసార్లు ప్రయత్నించిన కూడా బాణం కంగనాను వదిలివెళ్లడంలేదు. ప్రయత్నించిన ప్రతిసారి తన కాళ్ల దగ్గరే పడుతుంది.
దీంతో కార్యక్రమానికి విచ్చేసిన అందరూ అవాక్కయ్యారు. అదేంటీ మణికర్ణిక సినిమాలో తన విలువిద్య ప్రావీణ్యంతో మృగరాజు ను సైతం ఒకే ఒక్క బాణంతో మట్టికరిపించిన కంగనా ఎందుకు తడబడిందా అని అందరూ ఒకింత ఆశ్చర్యపోయారు.
బాణం గురితప్పడంతో పాపం కంగనా డీలా పడిపోయింది. రీల్ అయితే ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఏదైనా సాధ్యమవుతుంది. ఇది రియల్ కదా అందుకే కొంచెం తడబడింది. ఈ సారి ఇలాంటి కార్యక్రమాలకు వెళ్లితే ఖచ్చితంగా ముందే ప్రాక్టీస్ చేసి రావాలని మనసులో గట్టిగా అనుకున్నట్లు ఒక నవ్వు నవ్వింది. కాకపోతే మణికర్ణిక గురి తప్పిన బాణం వీడియో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
Viveka Murder Case: సునీత కాదట.. మరి, అవినాషేనా? షర్మిల మాటలకు అర్థం అదేనా?