
SVIMS : తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ 142 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. అనాటమీ, క్లినికల్ వైరాలజీ, జనరల్ సర్జరీ, హెమటాలజీ, మైక్రోబయాలజీ, న్యూరాలజీ, న్యూరో సర్జరీ, సైకియాట్రీ, యూరాలజీ, రేడియాలజీ, పెడియాట్రిక్స్, రుమటాలజీ విభాగాల్లో ఖాళీలున్నాయి.
ప్రొఫెసర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్/ డీఎం చేసి ఉండాలి. అలాగే 8-5 ఏళ్లు పని అనుభవం కూడా ఉండాలి. అసోసియేట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్/ డీఎం అర్హతగా నిర్ణయించారు. పని అనుభవం 2-5 ఏళ్లు ఉండాలి. అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగానికి సంబంధిత స్పెషలైజేషన్‌లో ఎండీ/ ఎంఎస్/ డీఎన్‌బీ/ ఎంసీహెచ్/ డీఎం చేసి ఉండాలి. అభ్యర్థులు దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పంపాలి.
మొత్తం పోస్టులు : 142
వయో పరిమిత : 50-55 ఏళ్లు
ఎంపిక : స్క్రీనింగ్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా
దరఖాస్తు ఫీజు : రూ.500
దరఖాస్తులు పంపడానికి చివరి తేదీ : 08-05-2023
అడ్రస్ : The Registrar, SriVenkateswara Institute of Medical Sceinces, SVIMS, Alipiri Road, Tirupati, TIRUPATI DISTRICT 517 502.
వెబ్‌సైట్: https://svimstpt.ap.nic.in/jobs.html