
Interview Skills : యువతకు మంచి సంస్థల్లో ఉద్యోగం సంపాదించడం ఎంత అవసరమో.. తమ సంస్థకు సరైన క్యాండెట్స్‌ను ఎంచుకోవడం కూడా యాజమాన్యాలకూ అంతే అవసరం. అభ్యర్థుల్లో తమకు కావాల్సిన స్కిల్స్ ఉన్నాయో? లేవో? తెలుసుకునేందుకే.. ముఖ్యంగా ఇంటర్వ్యూల్లో ఎలాంటి స్కిల్స్‌ను పరీక్షిస్తారో ఇప్పుడు తెలుసుకుందాం రండి.
ఉండాల్సిన లక్షణాలివీ..
ప్రతి విషయంలోనూ చురుకుగా, చలాకీగా ఉండాలి. అప్పుడే మీ పనితీరు మెరుగ్గా ఉంటుందని కంపెనీ రిక్రూటర్లు మిమ్మల్ని సెలక్ట్ చేస్తారు. ఉద్యోగం చేసేందుకు ఆయా విభాగానికి చెందిన నాలెడ్జ్ ఉండటం ఎంతో అవసరం. ఇంటర్వ్యూ చేసేటప్పుడు సబ్జెక్ట్ నాలెడ్జ్‌ను చూస్తారు. ఆఫీసులోకి వచ్చాక.. వివిధ వ్యక్తులతో మీరు ప్రవర్తించే తీరు, సంభాషణ గుణాలను గమనిస్తారు. ఉద్యోగం సాధించాలన్న తపన కంటే ఉన్నత స్థాయికి చేరాలనే తపన మీలో కనిపించాలి.
ఇవే కీలకం..
ఆఫీసులో చేయాల్సిన పని పట్ల ఎంత అంకిత భావం ఉందో కొన్ని ప్రశ్నల ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేస్తారు రిక్రూటర్లు. పనిచేసే చోట డెసిషన్ మేకింగ్ చాలా అవసరం.డె సిషన్ మేకింగ్‌లో వీక్‌గా ఉన్నవారిని ఏ సంస్థ రిక్రూట్ చేసుకోవడానికి ఇష్టపడదు. ఎప్పుడూ కొత్త విషయాలు నేర్చుకునే వారితో సంస్థకు చాలా ఉపయోగం ఉంటుంది. ఇంటర్వ్యూ చేసే సమయంలో మీకు కొత్త విషయాలు నేర్చుకునే ఆసక్తి ఉందా లేదా అన్నది రిక్రూటర్లు టెస్ట్ చేస్తారు.
Renu Desai: సెకండ్ మ్యారేజ్.. రేణూ దేశాయ్ క్లారిటీ.. ఎప్పుడంటే..?